నా రొమాన్స్ కి మగాడు కావాలి

Update: 2017-08-29 08:03 GMT
సాధారణంగా హీరోయిన్స్ కి మూడు పదుల వయసొచ్చాకా ఎటువంటి పాత్రలు చేస్తారో తెల్సిన విషయమే. ప్రస్తుత రోజుల్లో కొందరు మాజీ బాలీవుడ్ హీరోయిన్స్ నాలుగు పదుల వయసొచ్చినా ఇంకా కుర్ర హీరోలతో రొమాన్స్ కి రెడీ అవుతున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఘాటు ముద్దులకు కూడా అడ్డు చెప్పడం లేదు. అదే విధంగా వారి అందాల్ని కూడా ఇంకా ఇరవై వయసన్నట్టుగానే మెయింటెన్ చేస్తూ..స్కిన్ షోకి కూడా ఒకే అనేస్తున్నారు.

కరీనా కపూర్ కూడా తనకంటే చిన్నవాళ్ళైన యువ హీరోలతో హాట్ రొమాన్స్ చేసేసింది. అర్జున్ కపూర్ మరియు ఇమ్రాన్ ఖాన్ వంటి కుర్ర హీరోలతో చేసిన సినిమాల్లో  హాట్ రొమాన్స్ తో పెదాల ముద్దులతో రెచ్చిపోయింది ఇక ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూడా రణబీర్ కపూర్ తో ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఏ రేంజ్ లో  రొమాన్స్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఇప్పుడు అదే తరహాలో మరో సీనియర్ నటి కాజోల్ కూడా చేరిపోవడానికి రెడినా? అని అడిగితే కరెక్ట్ స్క్రిప్ట్ తగలాలేగాని ఎటువంటి అభ్యంతరం లేదని అంటోంది. అప్పట్లోనే బికినీ వేసి కుర్రకారును ఫిదా చేసినా ఈ అమ్మడు బాలీవుడ్ హీరోయిన్స్ కి ధీటుగా తన స్టార్ స్టామినాను చూపించింది. అయితే చాలా రోజుల తర్వాత విఐపి 2 సినిమాలో స్పెషల్ రోల్ లో మెరిసిన ఈ భామ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

రీసెంట్ గా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఈ అమ్మడు హాట్ సీన్స్ లో నటించడానికి ఎటువంటి అభిప్రాయం లేదని చెబుతూ.. ఆ పాత్రకు అవసరం అనుకుంటే తప్పకుండా చేస్తానని చెప్పింది. అంతే కాకుండా కుర్ర హీరోల కన్నా మగతనం ఉన్న హీరోలతో రొమాన్స్ చేయడం ఇష్టమని నిర్మొహమాటంగా చెప్పడం అందరిని షాక్ కి గురి చేసింది. మరి నిజంగా ఛాన్స్ వస్తే ఈ అమ్మడు ఏ రేంజ్లో రెచ్చిపోతుందో చూడాలి. అయితే ఆమె చెప్పే ఆ మగాళ్ళు ఎవరు మరి?



Tags:    

Similar News