కాజోల్ అందమంతా ఆమె కళ్లలో ఉంటుంది .. ఆ కనుబొమల కలయికలో ఉంటుంది. ఆకర్షణీయమైన ఆమె కళ్లు .. కట్టిపడేసే ఆ చూపులకు అప్పట్లో అభిమానులు కానివారు లేరు. మిగతా కథానాయిలతో పోలిస్తే కాజోల్ చేసింది తక్కువ సినిమాలే అయినా, అవి చూపిన ప్రభావం ఎక్కువ. బాలీవుడ్ లోనే కాదు వివిధ భాషల్లో ఆమెకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
వాళ్లంతా కూడా ఇప్పటికీ ఆమెను అభిమానిస్తూ ఉండటం విశేషం. వివాహమైన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న కాజోల్, ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చారు. తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతున్నారు.
అలా ఆమె ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సూరజ్ సింగ్ - శ్రద్ధ అగర్వాల్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రేవతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమాకి 'ద లాస్ట్ హుర్రే' అనే టైటిల్ అనుకున్నారు. కానీ రీసెంట్ గా ' సలామ్ వెంకీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమాలో తల్లి పాత్రలో కాజోల్ కనిపించనున్నారు. రీ ఎంట్రీలో తల్లి పాత్రలను పోషించినప్పటికీ, ఈ సినిమాలోని పాత్ర అందుకు భిన్నంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఇది రేవతి రాసుకున్న కథ. తన జీవితంలో తనకి ఎదురైన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఆమె ఈ కథ రానున్నారు. మధ్య వయసులో ఉన్న ఓ తల్లికి తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ పరిస్థితులను ఆమె ఒంటరిగా ఎలా ఫేస్ చేసింది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుందట. ఈ కథ తన మనసును కదిలించడం వల్లనే కాజోల్ వెంటనే ఒప్పేసుకున్నారని అంటున్నారు. ఈ పాత్ర తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే నమ్మకంతో ఆమె ఉందని చెబుతున్నారు.
ఇక రేవతి విషయానికి వస్తే తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఆమె అందరికీ సుపరిచితమే. తెలుగులో 'రాత్రి' .. 'ప్రేమ' .. 'అంకురం' చెప్పుకోదగిన సినిమాలుగా కనిపిస్తాయి. ఇక దర్శకురాలిగా కూడా ఆమెకి మంచి అనుభవం ఉంది. 'మిత్ర్ మై ఫ్రెండ్' .. 'ఫిర్ మిలేంగే' సినిమాలు ఆమె దర్శక ప్రతిభకు కొలమానంగా కనిపిస్తాయి. అలాంటి రేవతి నుంచి ఒక సినిమా వస్తుందంటే సహజంగానే అందరిలో ఆసక్తి ఉంటుంది. ఈ సినిమా ద్వారా రేవతి ఏం చెప్పాలనుకుంటున్నారో చూడాలి.