'కిన్నెరసాని' ట్రైలర్: మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న మెగా అల్లుడు..!
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''కిన్నెరసాని''. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ ఈ సినిమానకి దర్శకత్వం వహిస్తున్నారు. 'అతి సర్వత్ర వర్జయత్' (హద్దు లేకపోవడం ప్రమాదకరం) అనేది దీనికి ఉప శీర్షిక. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై ఫస్ట్ లుక్ - గ్లిమ్స్- టీజర్ కు మంచి రెప్పాన్స్ వచ్చింది. 'పార్వతీపురం' పాట శ్రోతలను అలరించింది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
'నీ ముందున్న సముద్రపు అలలను చూడు.. కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయి.. కానీ సముద్రం వాటిని వదలదు.. వదులుకోలేదు.. నేను కూడా అంతే..' అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా.. ఉత్కంఠ భరితంగా సాగింది. ఇది క్రైమ్ - సస్పెన్స్ అంశాలతో కూడా మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది.
అలానే కళ్యాణ్ దేవ్ తన తండ్రి కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు.. ఏదో రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నట్లు 'కిన్నెరసాని' ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇందులో కళ్యాణ్ చాలా కొత్తగా కనిపించారు. రవీంద్ర విజయ్ - ఆన్ శీతల్ - మహతి బిక్షు - కాశిష్ ఖాన్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు. 'కారణం లేని ప్రేమ.. గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదూ' వంటి డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
నటీనటుల హావభావాలు, లొకేషన్లు మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రామ్ తళ్లూరి నిర్మించిన 'కిన్నెరసాని'' చిత్రానికి దేశరాజ్ సాయితేజ్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ అందించగా.. అన్వర్ అలీ ఎడిటింగ్ వర్క్ చేశారు. అన్బు అరీవ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.
సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ - శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. రజనీ తళ్లూరి - రవి చింతల నిర్మాతలుగా వ్యవహరించారు. 'విజేత' సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్.. ఇప్పుడు విభిన్నమైన కథ కథనాలతో 'కిన్నెరసాని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ చిత్రం మెగా అల్లుడికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Full View