చిరు చిన్నల్లుడి ట్వీట్‌ కు నెటిజన్స్‌ ఫిదా

Update: 2019-06-26 14:38 GMT
ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో అమ్మాయిలంటే చిన్న చూపు ఉందనే విషయం అందరు ఒప్పుకోవాల్సిన చేదు నిజం. పల్లెటూర్లలో అమ్మాయిల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు ఎంతగా ఈ అసమానత్వంను పోగొట్టేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా ఉంది. తాజాగా ఇదే విషయమై చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ సోషల్‌ మీడియా ద్వారా చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఆరు నెలల క్రితం శ్రీజ పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆ పాపకు నవిష్క అని పేరు పెట్టారు. తాజాగా పాపకు ఆరు నెలలు పూర్తి అయిన సందర్బంగా కళ్యాణ్‌ దేవ్‌ తమ ఫ్యామిలీ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. శ్రీజ పెద్ద కూతురు కూడా ఈ ఫొటోలో చూడవచ్చు. కళ్యాణ్‌ కూతురు క్యూట్‌ నెస్‌ కు సోషల్‌ మీడియా జనాలు ఫిదా అవుతూ లైక్స్‌ కామెంట్స్‌ తో ముంచెత్తారు. చిన్నారికి శుభాకాంక్షలు ఆశీర్వాదాలు ఇచ్చిన నెటిజన్స్‌ కళ్యాణ్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలకు ఫిదా అయ్యారు.

అమ్మాయిల తల్లిదండ్రులను ఉద్దేశించి కళ్యాణ్‌ దేవ్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ... మీ కూతుర్ల పెళ్లి విషయంలో మీకు టెన్షన్‌ లేకుండా ఉండాలి అంటే వారిని సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చి దిద్దండి. అమ్మాయిల పెళ్లి కోసం డబ్బు కూడబెట్టే బదులుగా వారికి మొదటి నుండి మంచి ఎడ్యుకేషన్‌ ఇప్పించండి. స్వశక్తితో నిలిచేలా ఆమెను తీర్చి దిద్దండి. అమ్మాయిల పెళ్లి కంటే వారి కెరీర్‌ ను సరిగ్గా బిల్డ్‌ చేయడం చాలా ముఖ్యం. ఆ తర్వాత పెళ్లి విషయంలో ఎక్కువ టెన్షన్‌ అవసరం లేదంటూ కళ్యాణ్‌ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ పై నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తూ కళ్యాణ్‌ చాలా మెచ్యూర్డ్‌ గా చెప్పాడంటూ అభినందిస్తున్నారు.
Tags:    

Similar News