వేచి చూడటమా.. వేరేది చేయడమా?

Update: 2017-06-09 10:23 GMT
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి ఈ సమ్మర్ లో మంచి హిట్ దొరికింది. బాహుబలి-2 రిలీజ్ సమయానికి పెద్ద సినిమాలన్నీ రిలీజ్ వాయిదా వేసుకుని పోటీ నుంచి తప్పుకున్నాయి. కానీ బాహుబలి థియేటర్లలో ఉండగానే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో మంచి కలెక్షన్లే వస్తున్నాయి. దీంతో అక్కినేని కుటుంబానికి వరసగా రెండు హిట్లిచ్చిన ఖ్యాతి డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణకు దక్కింది.

నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా తో డైరెక్టర్ గా కళ్యాణ్ కృష్ణ ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా డీసెంట్ హిట్ కావడంతో నాగార్జున వెంటనే కళ్యాణ్ కృష్ణకు రెండో ఛాన్సిచ్చాడు. నాగ చైతన్య హీరోగా తీసిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడంతోపాటు చైతు నటనకు మంచి పేరు తేవడం ఫ్యాన్స్ కు ఆనందం కలిగించింది. దీంతో కళ్యాణ్ కృష్ణతో మూడో సినిమా కూడా చేసేందుకు నాగార్జున రెడీ అయిపోయాడు. సోగ్గాడే చిన్నినాయనలో బాగా క్లిక్కయిన బంగార్రాజు ప్రధాన పాత్రధారిగా సినిమా తీద్దామని డిసైడయ్యారు. ఈ మేరకు కళ్యాణ్ కృష్ణ స్టోరీ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఎందుకో ఈ సారి నాగ్ వెంటనే ఓకే చెప్పకుండా కళ్యాణ్ కృష్ణను వెయిటింగ్ లో ఉంచాడు. దీంతో అతడికి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. నాగ్ ఓకే అనేంతవరకు వెయిట్ చేయడమా లేక వేరే హీరోతో సినిమా ప్రారంభించడమా అన్నది తేల్చుకోలేకుండా ఉన్నాడు.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్టే అయినా ఈసారి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ టాలెంట్ గురించి మాట్లాడటం లేదు. అదీగాక సినిమా రివ్యూల్లో కూడా ఫస్టాఫ్ సాగదీతతో ఉందంటూ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీంతో వేరే హీరోతో సినిమా కమిట్ అవ్వాలన్నా పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేస్తే తప్ప ఓకే చెబుతారన్న గ్యారెంటీ లేదు. సో.. అటా.. ఇటా అన్నది ఈ యంగ్ డైరెక్టర్ కు క్లారిటీ రావడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News