నందమూరి కళ్యాణ్ రామ్ - సురేందర్ రెడ్డి అనుబంధం గురించి బైటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఈ ఇద్దరిమధ్యా కేవలం హీరో-డైరెక్టర్ లేదా హీరో-ప్రొడ్యూసర్ అనుబంధమే అనుకుంటారు. కానీ దానికి అతీతమైన స్నేహబంధం ఈ ఇద్దరిదీ. అతనొక్కడే సినిమా ఈ ఇద్దరికీ ల్యాండ్ మార్క్ సినిమా అయ్యింది. రెండు జీవితాల్ని దేధీప్యమానంగా వెలిగించిన సినిమా ఇది. అటు దర్శకుడిగా సూరికి పేరొచ్చింది. ఇటు హీరోగా కళ్యాణ్ రామ్ కి సక్సెస్ దక్కింది. ఈ సినిమా వల్లే ఈ ఇద్దరూ టాలీవుడ్ లో ఇంతకాలం విజయవంతంగా కొనసాగగలిగారు. ఈ ఇద్దరి కలయిక లో కిక్2 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పాడు.
అతనొక్కడే సినిమాలో హీరో క్యారెక్టర్ కి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోసం సిగరెట్ ని స్టయిల్ గా ఎలా తాగాలో నేర్చుకోమని సూరి ఓ దర్శకుడిగా సూచించాడు. అది మొదలు.. అప్పట్నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కానీ అనూహ్యంగా ఆ క్యారెక్టర్ తో సిగరెట్ తాగించడం ఎందుకు? ధూమపానం దూరంగా పెడితే బావుంటుందని సూరి ఆలోచన మార్చుకున్నాడు. సినిమాలో సిగరెట్ తాగే యాటిట్యూడ్ తీసేశారు. కానీ నిజజీవితంలో కళ్యాణ్ రామ్ ఆ తర్వాత దాన్నే రియల్ గా కొనసాగించాడు. ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు... సిగరెట్ మానెయ్ అని సూరి చెప్పడం.. రేయ్ నాకు అలవాటు చేశావు కదరా! అని కళ్యాణ్ రామ్ అనడం షరా మామూలే అయిపోయింది. ఇంట్రెస్టింగ్ గా లేదూ? ఈ స్టోరీ...!!