పవన్ ‘కళ్యాణ్’ రామ్

Update: 2018-01-07 06:24 GMT
అదేంటి రెండు పేర్లు అలా మిక్స్ అయ్యాయి అని ఆశ్చర్యపోకండి. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిని తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం కళ్యాణ్ రామ్ వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు అనే వార్త ఫాన్స్ మధ్య చర్చకు దారి తీస్తోంది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి కాజల్ హీరొయిన్ గా రూపొందుతున్న ఎంఎల్ ఎ(మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి)కాగా రెండోది తమన్నా జోడిగా నటిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం. నిజానికి వీటిలో మొదటి నుంచి న్యూస్ లో ఉంటూ వచ్చింది ఎమెల్యే మూవీనే. కాని దాని కంటే ఫాస్ట్ గా రెండో సినిమానే ఫినిషింగ్ కి వచ్చినట్టు తాజా అప్ డేట్. జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈయన గతంలో సిద్దార్థ్ తో 180 అనే మూవీ చేసి మెప్పు పొందారు.

ఇప్పుడు అజ్ఞాతవాసితో పాటు ఈ మూవీ టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. రేపు ఉదయం 10.15 నిమిషాలకు పేరు అనౌన్స్ చేయబోతున్నారు. టీజర్ 10వ తేది నుంచి అజ్ఞాతవాసితో పాటు వదలాలని డిసైడ్ అయినట్టు టాక్. అయినా తన బాబాయ్ బాలకృష్ణ జైసింహ సినిమా విడుదల అవుతుండగా అందులో కాకుండా అజ్ఞాతవాసితోనే ఎందుకు జత చేస్తున్నట్టు అనే ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. క్రేజ్ పరంగా ఓవర్సీస్ లో పవన్ మూవీకే ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి ఆ రకంగా సాఫ్ట్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ మూవీ టీజర్ దాంతో జత చేయటమే కరెక్ట్ అని భావించి ఉండవచ్చు. కళ్యాణ్ రామ్ - తమన్నా మధ్య సెన్సిటివ్ లవ్ స్టొరీ బేస్ గా తీస్తున్న ఈ సినిమాకు సుప్రసిద్ధ కెమెరామెన్ పిసి శ్రీరామ్ పని చేస్తుండటం మరో ఆకర్షణ. మరి ఇది ఎలా ఉండబోతోందో తెలియాలంటే బుధవారం దాకా ఆగాలి మరి.
Tags:    

Similar News