పెద్ద హీరోల సినిమాలు అంటే ముందు చూసేది బడ్జెటే. హీరోల రెమ్యునరేషన్ కే కోట్ల రూపాయలు ఇచ్చుకోవాలి. పేరున్న హీరోయిన్ ని పెట్టుకుంటే వాళ్లకిచ్చే అమౌంట్ తో పాటు అసిస్టెంట్లకయ్యే ఖర్చు కలిపి అది ఇంకో బర్డెన్. ఇక టాప్ టెక్నిషియన్స్ ని తెచ్చుకుంటే తడిసిమోపడవుతోంది. అందుకే పెద్ద హీరోల సినిమాలంటే బడ్జెట్ అంచనాల్ని దాటేస్తుంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా బడ్జెట్ విషయంలో కంట్రోల్ లో ఉండాల్సిందేనని దర్శకుడు బాబీకి నిర్మాత కల్యాణ్ రామ్ ముందే క్లియర్ గా చెప్పేశాడట.
జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో యాక్ట్ చేస్తున్నాడనే క్లారిటీ వచ్చింది. శుక్రవారం కొత్త మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. హీరో టూ నిర్మాతగా కల్యాణ్ రామ్ కి సొంత బ్యానర్లో హిట్స్ ఇచ్చిన లాభాల కంటే ఫ్లాప్స్ తెచ్చిన నష్టాలే ఎక్కువ. త్రీడీ మూవీ ఓం - కిక్-2 - మొన్న వచ్చిన ఇజం కల్యాణ్ రామ్ కి భారీ నష్టాలు మిగిల్చాయ్.
ఆ లాసెస్ నుంచి బయటపడేయటానికే అన్నయ్య బ్యానర్లో జూనియర్ సినిమా చేస్తున్నాడనే టాక్ ఉంది. ఇక బడ్జెట్ ని కూడా కంట్రోల్ లో ఉంచితే తమ్ముడి సినిమాతో లాభపడొచ్చు. అందుకే 45 కోట్లకి మించి రూపాయ్ కూడాఎక్స్ ట్రా పెట్టబోమని.. ఇచ్చిన బడ్జెట్లోనే సినిమా పూర్తి చేసేయాలని కల్యాణ్ రామ్ తో పాటు నిర్మాణ వ్యవహారాలు చూసుకునే కల్యాణ్ రామ్ మరిది హరి.. బాబీకి మరీ మరీ చెప్పినట్టు వినిపిస్తోంది. ఇటు జూనియర్ కూడా అన్నయ్య కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట. చూస్తుంటే ఈ సారి తన బ్యానర్లో బ్లాక్ బస్టర్ కొట్టి నష్టాల నుంచి బయటపడాలని కల్యాణ్ రామ్ పట్టుదలగా ఉన్నట్టున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/