ఒకప్పుడు టాలీవుడ్లో మల్టీస్టారర్లకు కొదవే ఉండేది కాదు. కానీ ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ.. శోభన్ బాబు.. కృష్ణం రాజుల తరం అయ్యాక మల్టీస్టారర్లకు తెరపడిపోయింది. స్టార్ హీరోలు ఎవరి దారిన వాళ్లు నడిచారు. రెండు మూడు దశాబ్దాల పాటు మల్టీస్టారర్ల ఊసే లేకపోయింది. మీడియం రేంజి హీరోలు కూడా కలిసి నటించడం అరుదైపోయింది. ఐతే కొన్నేళ్ల కిందట ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మళ్లీ మల్టీస్టారర్ల ట్రెండ్ మొదలైంది టాలీవుడ్లో. గత కొన్నేళ్లలో అడపా దడపా స్టార్ల కలయికలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది ఆల్రెడీ నాగార్జున-నాని కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మొదలైంది. దీని తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సైతం ఒక మల్టీస్టారర్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.
జూన్‌లో తన సొంత బేనర్లో ఒక మల్టీస్టారర్ చేయబోతున్నట్లు కళ్యాణ్ రామ్ ప్రకటించాడు. ఈ చిత్రానికి దర్శకుడెవరు.. తనతో కలిసి నటించే హీరో ఎవరు అన్నది త్వరలోనే వెల్లడిస్తానని అతను తెలిపాడు. నిజానికి గత ఏడాదే కళ్యాణ్ రామ్-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మొదలు కావాల్సింది. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఆ సినిమా కోసం సన్నాహాలు జరిగాయి. కానీ కథ కుదరక ఆ సినిమా ముందుకు కదల్లేదు. ఇది నిజమే అని కూడా కళ్యాణ్ రామ్ చెప్పాడు. తనకు మరో హీరోతో తెరను పంచుకోవడానికి ఏ ఇబ్బందీ లేదని.. సరైన కథ వస్తే తాను మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడైనా రెడీ అని నందమూరి హీరో ప్రకటించాడు.