నందమూరి కళ్యాణ్ రామ్ వరుసగా పరాజయాల పాలవుతున్నా కూడా వాటి గురించి ఆలోచించకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల విడుదలైన '118' చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సక్సెస్ ను దక్కించుకుంది. దాదాపు 8 కోట్ల రూపాయల షేర్ ను ఆ చిత్రం దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. బయ్యర్లను బయట పడేసిన 118 చిత్రం విడుదలై మూడు వారాలైన కాకుండానే నందమూరి కళ్యాణ్ రామ్ మరో సినిమాకు రెడీ అయ్యాడు.
118 చిత్రం షూటింగ్ సమయంలోనే కళ్యాణ్ రామ్ మల్లిడి వశిష్ఠ్ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. తాజాగా ఆ సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల చివర్లోనే ఈ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమా కోసం టెక్నీషియన్స్ మరియు నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. కళ్యాణ్ రామ్ ఈస్పీడ్ చూసి తోటి హీరోలు కూడా అవాక్కవుతున్నారు. వరుసగా ఫ్లాప్ అవుతున్నా కూడా కళ్యాణ్ రామ్ కాస్త జాగ్రత్త పడకుండా సినిమాలు చేయడం జరుగుతుంది. కాస్త స్లోగా కళ్యాణ్ రామ్ సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం నందమూరి ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతుంది.