ఈ సంక్రాంతికి గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు సినిమాలు పోటీకి దిగాయి. చివరికి వచ్చేసరికి ఒకట్రెండు సినిమాలు రేసులోంచి తప్పుకుంటాయేమో అనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. దీని వల్ల కలెక్షన్లలో అన్ని సినిమాలకూ కొంతవరకు కోత పడింది. ఐతే టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు ఈ పోటీని నివారిస్తూ.. జెంటిల్మన్ అగ్రిమెంట్లతో వేర్వేరు వారాల్లో సినిమాల్ని షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఆ మధ్య బెంగాల్ టైగర్ - సైజ్ జీరో - శంకరాభరణం నిర్మాతలు ఇలాగే రాజీకి వచ్చారు. లేటెస్టుగా స్పీడున్నోడు - కృష్ణగాడి వీర ప్రేమ గాథ - కృష్ణాష్టమి సినిమాల ప్రొడ్యూసర్ల మధ్య కూడా ఇలాంటి అండర్ స్టాండింగే జరిగింది.
ఐతే మార్చి 4వ తేదీ విషయంలో మాత్రం ఇలాంటి రాజీ ఏమీ ఉన్నట్లు లేదు. ఈ తేదీకి ఇప్పటికే మూడు క్రేజున్న సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ముందు పీవీపీ వాళ్ల ‘క్షణం’ సినిమాకు మార్చి 4న బెర్తు కన్ఫమ్ చేశారు. నెల కిందటే దీనికి డేట్ ఫిక్సయింది. ఆ తర్వాత మంచు మనోజ్ మూవీ ‘శౌర్య’ రేసులోకి వచ్చింది. ఇంతలో ఇప్పుడు చాన్నాళ్లుగా రిలీజ్ డేట్ కోసం చూస్తున్న నందిని రెడ్డి సినిమా ‘కళ్యాణ వైభోగమే’కు కూడా మార్చి 4నే విడుదల తేదీగా నిర్ణయించారు. ఈ మూడూ కాక.. శ్రీకాంత్ మూవీ ‘టెర్రర్’ - తమిళ డబ్బింగ్ సినిమా ‘శివగంగ’ కూడా అదే రోజు రాబోతున్నాయి. ప్రస్తుతానికి రేసులో ఉన్నవి ఇవి. ఇందులో చివరికి ఎన్ని మిగులుతాయో.. కొత్తగా ఇంకేవైనా యాడ్ అవుతాయేమో చెప్పలేం.