కళ్యాణ ముహూర్తమూ అప్పుడేనా..?

Update: 2016-01-21 04:12 GMT
ఎలాగోలా పెళ్లి జరిగిపోవాలంటే వధూవరులుంటే సరిపోతుంది. కానీ అది వైభోగంగా జరగాలంటే మాత్రం అందమైన అలంకారంతోపాటు అయినవారి ఆశీస్సులు ఉండాలి. ఇవేవీ చూడకుండానే ఓ కల్యాణానికి ముహూర్తం ఖరారు చేసేశారు. ఇంతకీ ఎవరదా పెళ్లి అంటారా...?

నందిని రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక జంటగా తెరకెక్కిన చిత్రం కళ్యాణ వైభోగమే. ఈ సినిమాని తొలుత రేపు (జనవరి 22న) విడుదల చేయాలని అనుకున్నారు. తీరా సంక్రాంతి పండగ సినిమాల వల్ల థియేటర్లు లేవంటూ ముహూర్తాన్ని ఫిబ్రవరి 5కి వాయిదా వేశారు. ఇక్కడే వచ్చింది చిక్కంతా. ఇప్పటికే ఆ ముహూర్తానికి ఓ ముగ్గురు కుర్ర హీరోలు పీట వేసి కూర్చున్నారు. ఇంతలో ఈ జంట వచ్చి చేరింది. ఇవన్నీ ఒకే స్థాయి సినిమాలు. సునీల్ కి దిల్ రాజు అండ ఉంటే, 14 రీల్స్ సంస్థకి నాని గత సినిమా విజయం దన్నుగా ఉంది. ఇక బెల్లంకొండ గురించి చెప్పే పనిలేదు. అన్నిటినీ మించి సంక్రాంతికి విడుదలైన స్టార్ హీరోల సినిమాలు కొన్ని థియేటర్లలోనైనా 3వ వారం నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు లేని థియేటర్లు అప్పుడు మాత్రం ఎక్కడినుండి వస్తాయట. ఇవన్నీ చూసుకోకుండా ముహూర్తం ఫిక్స్ చేస్తే ప్రేక్షకుల ఆశీస్సులు (వసూళ్లు) ఎలా వస్తాయనుకున్నారో ఏమో..!?    
Tags:    

Similar News