సంక్రాంతి రేసులో చిన్న సినిమా.. వాళ్లతో ఢీ కొట్టేందుకు రెడీ..!

Update: 2022-12-06 13:30 GMT
ఇప్పటికే సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయని తెలుస్తుండగా వాటికే థియేటర్ల అడ్జెస్ట్మెంట్ ఎలా అని గొడవలు పడుతున్నారు. చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి రెండు సినిమాలు సంక్రాంతి పోటీకి రెడీ అవుతున్నాయి. వీటితో పాటుగా దిల్ రాజు నిర్మిస్తున్న దళపతి విజయ్ వారసుడు మూవీ కూడా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ మూడు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు దాదాపు పంచుకున్నారని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు యువ హీరో సంతోష్ శోభన్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో కళ్యాణం కమనీయం మూవీ తెరకెక్కుతుంది.

ఈ సినిమాను నూతన దర్శకుడు అనీల్ డైరెక్ట్ చేస్తున్నారు. సంతోష్ శోభన్ కు బ్యాక్ బోన్ గా నిలుస్తున్న యువి క్రియేషన్స్ అతనితో వరుస సినిమాలు చేస్తున్నారు. కళ్యాణం కమనీయం మూవీ కూడా సంక్రాంతి రేసులో నిలుస్తుందని తెలుస్తుంది.

ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది. వాటితో పాటుగా కంటెంట్ బాగుండి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తే ఈ స్మాల్ మూవీస్ కూడా హిట్ సాధిస్తాయి. అలానే ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య, విజయ్ సినిమాల మధ్య సంతోష్ శోభన్ మూవీ కూడా వస్తుంది.

ఆ మూడు సినిమాలకే థియేటర్ లు దొరక్క కొట్టుకుంటుంటే ఇప్పుడు యువి వారు తమ సినిమాతో పెద్ద షాక్ ఇచ్చారు. ఎలాగు వారు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు కాబట్టి సొంత సినిమాకు తగినన్ని థియేటర్లు తీసుకునే ఛాన్స్ ఉంది.

అలా పొంగల్ వార్ లో పెద్ద సినిమాలను ఢీ కొడుతున్నాడు యువ హీరో సంతోష్ శోభన్. తను నేను, పేపర్ బోయ్ సినిమాలు చేసిన సంతోష్ శోభన్ ఏక్ మిని కథతో హిట్ అందుకున్నాడు. ఓటీటీలో రిలీజైనా సరే ఆ మూవీ ప్రేక్షకులను అలరించింది. ఆ జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు సంతోష్ శోభన్.

రీసెంట్ గా ఈ యువ హీరో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ మూవీతో వచ్చాడు. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. అందుకే కళ్యాణం కమనీయంతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు సంతోష్ శోభన్. ఈ మూవీలో తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News