తల్లి బర్త్ డే సందర్భంగా మెగా అల్లుడి ఎమోషనల్ పోస్ట్..!

Update: 2022-07-12 06:30 GMT
గత కొన్నాళ్లుగా మెగా కపుల్ కళ్యాణ్ దేవ్ - శ్రీజ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి భర్త కళ్యాణ్ దేవ్ పేరు తొలగించి 'కొణిదెల' ఇంటి పేరుని జత చేయడంతో వీరి విడాకుల పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనికి తగ్గట్టుగానే మెగా అల్లుడు కళ్యాణ్ మెగా ఫ్యామిలీతో కలిసి కనిపించకపోవడంతో ఈ రూమర్స్ కు బలం చేకూరింది.

కళ్యాణ్ దేవ్ అప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదు. తన సినిమాలను కూడా ప్రమోట్ చేసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా మెగా అల్లుడు పెట్టిన ఓ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.

కళ్యాణ్ దేవ్ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. తల్లితో ఉన్న అందమైన ఫోటోని షేర్ చేయడమే కాదు.. ఆసక్తికరమైన సందేశాన్ని రాసుకొచ్చాడు.

''పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ!.. జీవితం కొన్నిసార్లు ఎంతో కష్టతరంగా మారుతుంది. కానీ నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో ఎలాంటి అడ్డంకినైనా ఎదుర్కొంటానని నమ్మకం నాకుంది. ఎల్లప్పుడూ నా కోసం నిలబడినందుకు ధన్యవాదాలు. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అమ్మా!' అంటూ కళ్యాణ్ తన తల్లి మీద ఉన్న ప్రేమను వ్యక్త పరిచాడు.

కళ్యాణ్ దేవ్ తన తల్లికి శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా జీవితం కొన్నిసార్లు కఠినంగా మారుతుందని పేర్కొనడంతో.. తన వైవాహిక జీవితంలో జరుగుతున్న వ్యవహారాన్నే ప్రస్తావిస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తారెమో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ ను కళ్యాణ్ దేవ్ 2016లో వివాహం చేసుకున్నాడు. శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకొని.. నివృతి అనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అతనితో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ తో రెండో పెళ్లి చేశారు. కళ్యాణ్ - శ్రీజ దంపతులకు ఓ పాప కూడా ఉంది.

అంతా సవ్యంగానే ఉందని అనుకుంటుండగా.. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. గతేడాది శ్రీజ పెద్ద కూతురు పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన కళ్యాణ్ దేవ్.. ఈసారి విష్ చేయలేదు. కానీ ఇప్పుడు తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టడం గమనార్హం.
 
కళ్యాణ్ దేవ్ - శ్రీజ విడాకులపై ఎన్ని వస్తున్నా వస్తున్నా ఇరు వర్గాలు మౌనంగానే ఉంటూ వస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగని రూమర్స్ ను ఖండించనూ లేదు. మరి త్వరలోనే వీటిపై స్పష్టత ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News