నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్యాణ్ రామ్, హీరోగా .. నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. హిట్లపై హిట్లు వచ్చి పడకపోయినా ఆయన ఎప్పుడూ నిరాశపడలేదు. తన ప్రయత్నం తాను చేస్తూ వెళుతుంటాడు. సినిమా గురించి తప్ప ఆయన మరో విషయాన్ని గురించి ఆలోచించడు. బయట ఎక్కడా ఏ ఫంక్షన్స్ లోను కనిపించడు. తన పనిని తాను ఒక తపస్సులా చేసుకుపోవడమే కనిపిస్తుంది. అలాంటి కల్యాణ్ రామ్ నుంచి ఆయన తాజా చిత్రంగా ఆగస్టు 5వ తేదీన రావడానికి 'బింబిసార' సిద్ధమవుతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగాంగా ఆయన మాట్లాడుతూ తన జర్నీని గుర్తుచేసుకున్నా డు. తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు బాలయ్య బాబాయ్ తమ ఇంటికి వచ్చారనీ, 'బాల గోపాలుడు' సినిమాతో తనని సినిమాలకి పరిచయం చేయాలనుకుంటున్నట్టు చెప్పారని అన్నాడు. అయితే చదువు పాడైపోతుందనే ఉద్దేశంతో తన తండ్రి ముందుగా ఒప్పుకోలేదనీ, అప్పుడు బాబాయ్ పట్టుబట్టి ఆయనను ఒప్పించారని చెప్పాడు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తాను కెమెరా ముందుకు వచ్చానని అన్నాడు.
ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్టుగా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నప్పటికీ, చదువుపైనే దృష్టి పెట్టడం జరిగిందని చెప్పాడు. చదువు పూర్తయిన తరువాతనే మళ్లీ సినిమాల దిశగా అడుగులు వేశాననీ, 'తొలిచూపులోనే' సినిమాతో హీరోగా తనని రామోజీరావు గారు పరిచయం చేశారని అన్నాడు.
కాశీనాథ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఫ్లాప్ కావడంతో, తన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారని చెప్పాడు. అప్పుడు తనని తాను నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడిందనీ, దాంతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని 'అతనొక్కడే'తో హిట్ కొట్టడం జరిగిందని అన్నాడు.
అప్పట్లోనే గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ 'ఓం' అనే సినిమాతో ఒక ప్రయోగం చేశాననీ, అయితే ఆ ప్రయోగం ఫలించలేదని చెప్పాడు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడాన్ని తాను గమనించానని అన్నాడు.
కోవిడ్ తరువాత థియేటర్లకు ఇక జనాలు రారేమో అని అంతా అనుకుంటున్న సమయంలో వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' ఆ సందేహాలకు తెర దింపేసిందని చెప్పాడు. కొత్తదనం కోసం .. మారుతున్న ట్రెండ్ కి తగినట్టుగా తాను చేసిన 'బింబిసార' ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.