వివాదం చుట్టుముట్టకపోతే అది కమల్ హాసన్ సినిమా ఎందుకవుతుందన్నట్టుగా తయారైంది పరిస్థితి. కొత్తగా ఓ సినిమాని బయటికి తీసుకురావాలంటే ఆయన ఓ చిన్నపాటి యుద్ధం చేయాల్సిందే! ఎంచుకొనే కథల ప్రభావమే అంతో లేక కావాలనే ఆయన్ని వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారో తెలియదు కానీ... కొంతకాలంగా ఏదో రకంగా కమల్ హాసన్ సినిమాలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. వాటిని విడుదల చేసుకోవాలంటే కమల్ తలప్రాణం తోకకొస్తుంటుంది. అయితే వివాదాలు కమల్‌కి కొత్త కాకపోవడంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొండిగా పోరాడి తాను అనుకున్న కథని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటాడు.
ఇటీవల మొదలుపెట్టిన శభాష్ నాయుడు సినిమా చుట్టూ కూడా అప్పుడే వివాదాలు అలుముకున్నాయి. ఆ టైటిల్ పై తమిళనాడులోని విడుతలై సిరుతై గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పేరు మార్చాల్సిందే అని పట్టుబడుతోంది. దీంతో వివాదాల విషయంలో కమల్ కి ఉపశమనం లేదన్నట్టుగా మారింది పరిస్థితి. మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ ఎవరో ఒకరు - ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేస్తుండడంపై కమల్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. మరి కొత్త సినిమా పేరు విషయంలో ఆయన వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి. కమల్ హాసన్ - బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం శభాష్ నాయుడు. కమల్ స్నేహితుడు రాజీవ్ దర్శకత్వంలో తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. దశావతారంలోని ఓ పాత్రని పోలినట్టుండే క్యారెక్టర్ లో కమల్ నటిస్తున్నాడు.