కరోనా మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఏ రేంజ్ లో పడిందో అందరికీ తెలిసిందే. కరోనా పరిస్థితులు చూస్తుంటే సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునేలా లేవు. ఇప్పటికే విడుదల తేదీలను వాయిదా వేసుకున్న సినిమాలు ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చేలా కనబడటం లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే సమ్మర్ సీజన్ లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకులతో కళకళలాడే థియేటర్స్ నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు - మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో.. ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందో చెప్పలేని కారణంగా రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమలో చాలా మార్పులకు కారణం కాబోతోందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్ లో విడుదల చేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ఆలోచిస్తున్న ఈ విధానం గురించి లోకనాయకుడు కమల్ హాసన్ ఏడేళ్ల క్రితమే ఆలోచించాడు.
కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వం మరియు స్వీయ నిర్మాణంలో రూపొందించిన ‘విశ్వరూపం’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ తో పాటు డీటీహెచ్ ద్వారా ఇళ్లలోనూ రిలీజ్ చేయాలని చూశారు. 'విశ్వరూపం' సినిమాకి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి కొన్ని ఇబ్బందులు ఎదురుకావడం.. దీంతో పాటు తమిళనాట థియేటర్ల విషయంలో మోనోపలీ నడుస్తుండటంతో దానికి చెక్ పెట్టేందుకు కమల్ ఈ ఆలోచన చేశారు. డీటీహెచ్ లో సినిమా చూసేందుకు ఒక రేట్ డిసైడ్ చేసి.. నేరుగా ఫస్ట్ డే టీవీల్లో సినిమా చూసే అవకాశం కల్పించాలనుకున్నారు. అంతే కాకుండా సినిమాను రికార్డ్ చేసుకునే ఛాన్స్ లేకుండా.. పైరసీ చేసే అవకాశం లేకుండా ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నారు. అయితే కమల్ హాసన్ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. థియేటర్ల యాజమాన్యాలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో కమల్ తన ఆలోచనను విరమించుకున్నారు.
అయితే కమల్ హాసన్ ఆలోచనను ఇప్పుడు అమల్లో పెట్టడానికి మంచి అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతుండటంతో థియేటర్లు నెల కిందట్నుంచి మూత పడి ఉన్నాయి. ఒకవేళ రాబోయే రోజుల్లో లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్లు తెరుచుకోడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా సినిమాలు రిలీజ్ చేయాలనీ ఆలోచిస్తున్నారు. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయంతో పెట్టుబడి రికవర్ కాదు. ఒకసారి ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తర్వాత థియేట్రికల్ రిలీజ్‌కు అవకాశం ఉండదు. అందుకే కమల్ హాసన్ సూచించిన విధంగా డీటీహెచ్ ల ద్వారా ఒక రేటు పెట్టి సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. వాటి ద్వారా కొంత ఆదాయం రాబట్టుకున్నాక ఓటీటీలతో ఒక రేటు మాట్లాడుకొని వాటికి సినిమా ఇచ్చేస్తే పెట్టుబడి రికవర్ చేసుకోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి సినీ ఇండస్ట్రీ లోకనాయకుడు చూపిన దారిలో నడుస్తారో లేదా మరో కొత్త విధానాన్ని అనుసరిస్తారో చూడాలి.