తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం దక్కినా పొంగిపోయే పరిస్థితి కొన్నేళ్లుగా. అసలు ఆ గౌరవానికి కూడా నోచుకోకుండా కొన్నేళ్ల గడిచిపోయాయి మధ్యలో. ఐతే గత ఏడాది ‘చందమామ కథలు’ సినిమాకు ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు రావడంతో పొంగిపోయాం. అలాంటిది ఈసారి ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపికై తెలుగువారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. అంతులేని ఆనందాన్ని మిగిల్చింది.
ఐతే విశేషం ఏంటంటే.. తెలుగు సినిమాకు ఈసారి ఇదొక్కటే అవార్డు కాదు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారం కూడా దక్కింది. ‘బాహుబలి’లా పెద్ద కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘కంచె’ తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవడం విశేషం. కాబట్టి ఈసారి తెలుగు సినిమాకు డబుల్ ధమాకానే అన్నమాట. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన ‘విసారణై’ ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైనప్పటికీ.. నేషనల్ అవార్డులకు గత ఏడాదే నామినేట్ అయింది.
‘కితకితలు’ తరహాలో తయారైన హిందీ సినిమా ‘దమ్ లగా కె హైషా’ ఆ భాషలో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. నిజానికి ‘బాహుబలి’ జాతీయ స్థాయిలో ఎంత పెద్ద హిట్టయినప్పటికీ.. ఆ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈ పురస్కారం ‘బాజీరావ్ మస్తాని’కి వస్తుందని బాలీవుడ్ జనాలు ఆశించారు. ఐతే ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని బెస్ట్ డైరెక్టర్ గా ఎంపిక చేసి.. మన సినిమాకు ‘ఉత్తమ చిత్రం’ అవార్డు కట్టబెట్టి బాలీవుడ్‌కు షాకిచ్చింది జ్యూరీ.