టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ తో కంగన గొడవ గురించి తెలిసిందే. `మణికర్ణిక` చిత్రాన్ని క్రిష్ 70శాతం చిత్రీకరించినా, ఆ క్రెడిట్ అంతా తనకే చెందుతుందంటూ కంగన కలరింగ్ ఇవ్వడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. షూటింగ్ చివరిలో కంగనపై అలిగి క్రిష్ వచ్చేయడం అతడికి పెద్ద డ్యామేజ్ గా మారిందన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. `మణికర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` ఇటీవలే రిలీజై విజయం సాధించిన నేపథ్యంలో క్వీన్ ముఖంలో కొత్త కాంతులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కంగన ఫేస్ పెట్రోమాక్స్ లైట్ లా నియాన్ కాంతులతో వెలిగిపోతోంది. ఇప్పటికే తొలి వీకెండ్ 50 కోట్లు పైగా షేర్ సాధించి `తను వెడ్స్ మను` రికార్డుల్ని సైతం బ్రేక్ చేసిన ఈ చిత్రం కంగన ఆల్ టైమ్ బెస్ట్ చిత్రంగా నిలవనుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. 100 కోట్లు పైగా షేర్ వసూలు చేసే దిశగా మణికర్ణిక దూసుకెళుతోందన్నది ట్రేడ్ రిపోర్ట్.
ఈ నేపథ్యంలోనే కంగన ఎక్కడికి వెళ్లినా `మణికర్ణిక` వివాదం గురించి ప్రస్థావన వస్తోంది. విలేకరులు పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. క్రిష్ తో గొడవపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి రిలీజ్ ముందు ఒకలా.. రిలీజ్ తర్వాత ఒకలా స్వరం మార్చి రెండు నాల్కల ధోరణితో కంగన చెలరేగిపోవడంపైనా ప్రస్తుతం క్రిష్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. క్రిష్ తో గిల్లికజ్జాలు ఆడుతున్న కంగనపై అతడి అభిమానులు అంతే సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.
మొన్న ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కంగన సెటైరికల్ గా ఆన్సర్ చేసింది.. క్రిష్ - సోనూసూద్ కాంబినేషన్ లో ఇలాంటి సినిమా వచ్చి విజయం సాధిస్తే చూడాలనుందని కంగన వ్యాఖ్యానించడంపై ఆసక్తికర చర్చ సాగింది. ఆ ఇంటర్వ్యూలో చిలిపిగా నవ్వేస్తూ.. కొంటెగా సెటైర్లు వేస్తున్న కంగన వాలకం చూస్తుంటే ఔరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు. అసలు నేను తీసిన సినిమా ఇది.. ఈ క్రెడిట్ నాదే! అంటూ కంగన ఇస్తున్న కలరింగ్ ఎంతో బోల్డ్ గా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా క్వీన్ కంగన ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్ లో టిప్ టాప్ గా ప్రత్యక్షమైంది. మణికర్ణిక సక్సెస్ గ్లో ఈ అమ్మడిలో ఓ రేంజులో కనిపిస్తోందని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఒక అభిమాని కంగన ఫ్యాషన్ ని కామెంట్ చేస్తూ.. వీళ్లకంటే అండర్ వేర్ కంపెనీ మోడల్స్ బెటర్! అంటూ ఘాటైన వ్యాఖ్యను చేశాడు. `గ్యాంగ్ స్టర్` సినిమాతో తెరంగేట్రం చేసింది. డబ్బు వచ్చాక ఇలా అయ్యింది. ఇది చూసి జెలసీ ఫీలవుతున్నావా? అంటూ వేరొక అభిమాని రిప్లయ్ ఇచ్చాడు. మొత్తానికి క్వీన్ ఇప్పుడు హాట్ టాపిక్.