బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రౌనత్ చిక్కుల్లో పడ్డారు. కంగన సోదరి రంగోలీ తాజాగా ఓ మతస్థుల ప్రజలను టార్గెట్ చేసుకొని టెర్రరిస్టులు అంటూ కామెంట్ చేశారు. మొరదాబాద్ లో వైద్యులు, పోలీసులపై ఓ వర్గం చేసిన దాడికి సంబంధించిన వీడియోను ఉద్దేశించి రంగోలి పరుషమైన పదాలతో కామెంట్ చేసింది. సోదరి వ్యాఖ్యలను కంగన సమర్థిస్తూ కామెంట్ చేసింది. సోదరిని కంగనా రౌనత్ వెనకేసుకొచ్చి మద్దతు తెలిపారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది.
కంగనా రౌనత్, ఆమె చెల్లెలు విద్వేష పూరితమైన వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాపిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మారణహోమం, హింసను సృష్టించేలా రంగోలి కామెంట్ చేస్తే దానికి కంగన మద్దతు తెలుపడం దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలు దెబ్బతీసి నిరసనలకు దారితీస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ వర్గాన్ని.. మరో వర్గంపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు.
అడ్వకేట్ అలీ కాపిఫ్ ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్టార్ హీరోయిన్ కంగనా రౌనత్ - సోదరి రంగోలి - ఆమె మేనేజర్ లపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా కంగనా ఆమె సోదరి ఇలా చేసినందుకు క్షమాపణలు చెప్పారు. ఇదివరకే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు కంగనా అకౌంట్ ను ట్విట్టర్ రద్దు చేసేసింది. ఇప్పుడు అయినా మరోసారి వ్యాఖ్యానించడం దుమారం రేపింది.