అబ్బబ్బా.. అక్కడ మునిగేసింది.. కేక

Update: 2017-05-05 12:45 GMT
అసలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్నప్పుడే.. ఉత్తినే పోసే వడకట్టిన నీరును వద్దని.. స్నానానికి కూడా స్టార్ హీరోయిన్లు మినరల్ వాటర్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. చివరకు బురద నీళ్లు ఉన్నట్లు.. వాన నీటిలో తడసినట్లు నటించాలన్నీ కూడా.. ఆ నీరంతా కలర్ వేసిన మినరల్ వాటరే కావాలి. లేకపోతే హెల్త్ పాడవుతుంది. అలాంటి హీరోయిన్లు ఎవరైనా గంగలో మునగమంటే మనుగుతారా?

ఏదో మాటవరసకి కూడా గంగానదిలో ఓ ఆరుసార్లు మునగమంటే మునగరు. కాని హర హర మహాదేవ్ అంటూ ఆరుసార్లు మునిగింది స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ తరువాత కూడా ఒక వీడియో తీసుకుంటాం మరోసారి మునగవా అంటూ మీడియా వారు రిక్వెస్ట్ చేస్తే.. వారి కోసం మరో రెండుమూడుసార్లు మనిగింది క్వీన్. నిన్న సాయంత్రం గంగానది తీరాన.. పవిత్ర కాశి నగరంలో.. ''మణికర్ణిక'' సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా పట్టు బట్టల్లో.. అది కూడా డిజైనర్ వేర్ లో.. హారతిని అందుకుని.. గంగలో మునకలేసింది ఈ స్టార్ బ్యూటి. ఈ వీడియో చూసినోళ్లందరూ.. ఒక ప్రక్కన హాట్ క్వీన్ గా తన సత్తా చూపిస్తూనే.. మరో ప్రక్కన ఇంత సాంప్రదాయబద్దంగా కంగనా ఉండటం సూపర్ అంటున్నారు సినిమా లవర్స్.

ఇకపోతే అసలు పాత్ర కోసం.. సినిమా సక్సెస్ కోసం.. ఏం చేయడానికైనా రెడీగా ఉండే కంగనా.. గంగలో కాదు.. కావాలంటే ఎక్కడైన మునుగుతుంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇంతకీ గంగానదిని శుభ్రపరిచే ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది గురూ?

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News