90 కోట్ల బ‌డ్జెట్ సినిమా 3కోట్ల వ‌సూళ్లు.. శాటిలైట్ జీరో!

Update: 2022-05-27 03:30 GMT
ఒక ప‌రాభ‌వం వెంటే మ‌రిన్ని పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తాయి. ఇప్పుడు అలాంటి వ‌రుస‌ ప‌రాభ‌వాల‌తో విసిగిపోతోంది కంగ‌న ర‌నౌత్. ఈ భామ నటించిన ధాకడ్ పెద్ద ఫ్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. జీరో ఆడియన్స్ కారణంగా అనేక షోలు రద్ద‌య్యాయి. తొలి మూడు రోజులు పేల‌వ‌మైన బాక్సాఫీస్ ప్ర‌ద‌ర్శ‌న‌తో స్క్రీన్ లు ఆదివారం నుండి గణనీయంగా తగ్గాయి. సోమవారం నుండి మరిన్ని తగ్గాయి. ఈ చిత్రం కేవలం తొలి వీకెండ్ కోటిన్న‌ర మాత్ర‌మే తేగ‌లిగింది. శుక్రవారం 50 లక్షలు వ‌సూలు చేయ‌గా.. శని- ఆదివారాల్లో వృద్ధి కనిపించలేదు. ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ రూ. రూ. 3 కోట్లు మాత్ర‌మేన‌ని విశ్లేషించారు.

కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు కంగ‌న‌కు మ‌రో ప‌రాభ‌వం ఎదురైంది. ఢాకడ్ ఘోర‌ పరాజయం తర్వాత OTT - శాటిలైట్ హ‌క్కుల‌ను ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావ‌డం లేదు. ఇక శాటిలైట్ - డిజిటల్ రైట్స్ అమ్మకం ద్వారా కూడా ఢాకడ్ కు పెద్దగా ఆదాయం రాదని తేలిందంటూ బాలీవుడ్ మీడియాలో ఒక క‌థ‌నం వైర‌ల్ గా మారింది.

సాధారణంగా ధాక‌డ్ శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడవ్వాల్సింది. సినిమాను స్ట్రీమింగ్ దిగ్గజం .. టెలివిజన్ ఛానెల్ కు విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం తరచుగా నిర్మాతలకు లాభం చేకూర్చడానికి సహాయపడుతుంది. ధాకడ్ విషయంలో అలా జ‌ర‌గ‌లేదు. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో నిర్మాతలు వీటిని విక్రయించలేదు. మంచి ఒప్పందాన్ని ఆశించి విడుదలకు ముందు హక్కులను త‌మ‌తో ఉంచుకున్నారు. అందుకే వారు OTT - శాటిలైట్ భాగస్వామి గురించి మూవీ ప్రారంభోత్స‌వంలో కూడా ఎక్క‌డా ప్రస్తావించలేదని తెలిసింది.  

ధాక‌డ్ టికెట్ విండో వద్ద ఘోరంగా ఫ్లాప్ అయిన తర్వాత.. నిర్మాతలు OTT - శాటిలైట్ హక్కుల కోసం చాలా ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలని ఆశించలేర‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ మ‌రీ పేలవమైన మేకింగ్ తో తెరకెక్కింద‌ని ఇప్పటికే ప్రచారం జరిగింది. పైగా ఇది అడల్ట్ ఫిల్మ్ .. టీవీ ప్రీమియర్ కోసం మళ్లీ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. ఇది ధాక‌డ్ కి అదనపు ప్రక్రియ.. అన్న టాక్ కూడా న‌డుస్తోంది.

ధాకడ్ ను జీ స్టూడియోస్ థియేటర్ లలో పంపిణీ చేసింది. జీ వర్టికల్స్- జీ5 - జీ సినిమా హక్కులను కొనుగోలు చేస్తారని మార్కెట్ లో బజ్ ఉంది. అయితే ``జీ5  ఈ చిత్రానికి OTT భాగస్వామి కాదు. అమెజాన్ ప్రైమ్ కి వీడియో హక్కులను విక్రయించడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల్లో స్పష్టత వ‌స్తుంది`` అని తెలుస్తోంది. అయితే పరిశ్రమలోని ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ``జీ ఇప్పటికీ టీవీ -డిజిటల్ ప్రీమియర్ కోసం బోర్డులోకి రావచ్చు. ఇది వేచి చూసే పరిస్థితి`` అని అన్నారు.

ఏదేమైనా ధాకడ్ నిర్మాతలు ఇప్పుడు శాటిలైట్ ఓటీటీ హక్కుల అమ్మ‌కాల్లో తక్కువ ధరతో సరిపెట్టుకోవలసి ఉంటుంది. దాదాపు రూ. 80-90 కోట్ల బడ్జెట్ తో ఢాఖడ్ ను నిర్మించారు. నిర్మాతల‌ నష్టాలు ఊహించలేనంతగా ఉంటాయి అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ధాక‌డ్ వైఫ‌ల్యం కంగ‌న‌కు కెరీర్ పరంగా అతి పెద్ద పాఠం.
Tags:    

Similar News