క్వీన్ కంగనా రనౌత్ ఎటాకింగ్ స్టైల్ గురించి తెలిసిందే. తాను ఏం మాట్లాడినా సంచలనమే. ఎలాంటి టాపిక్ అయినా అవలీలగా భీతి బెరుకు లేకుండా మాట్లాడేస్తుంది. నెపోటిజం.. ఇండస్ట్రీ మాఫియా లాంటి అంశాలపై మాట్లాడటం అంటే కంగన కి ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. తాజాగా బాలీవుడ్ లో కపుల్స్ కాబోతున్న విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ వివాహం గురించి పరోక్షంగా తనదైన శైలిలో స్పందించింది.
``లైఫ్ లో సక్సెస్ అయిన ధనవంతులైన పురుషులు తక్కువ వయసున్న స్త్రీలను వివాహం చేసుకోవడం గురించి ఎప్పటికప్పుడు కథలుగా వింటాం. అదే ఎక్కువ విజయవంతమైన స్త్రీలు..తక్కువ వయసున్న పురుషులను పెళ్లి చేసుకేంటే పెద్ద తప్పుగా భావిస్తుంటారు. ఒక నిర్ధిష్ట వయసు తర్వాత మహిళలకు వివాహం అసాధ్యమని.. తనకన్నా చిన్న వయసు వాడిని ఇక పెళ్లి చేసుకోవడం కుదరదని అంటారు. అలాంటింది భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ లేడీ ఆ నిబంధనల్ని బ్రేక్ చేసి ముందుకెళ్లడం ఆనందంగా ఉంది. మూస విధానాన్ని బ్రేక్ చేసినందుకు ఆ జంటకు` అభినందనలు!`` అంటూ రాసుకొచ్చింది. విక్కీ కౌశల్ బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నటుడిగా స్థిరపడుతున్నాడు. కానీ కత్రినా తనకంటే పెద్ద స్టార్. రిచ్ గాళ్ కూడా. అన్ని రకాలుగాను విక్కీని డామినేట్ చేస్తుంది. వయసు రీత్యా ఇద్దరి మధ్యా ఐదేళ్ల గ్యాప్ ఉంది.
విక్కీ వయసు 33 కాగా.. క్యాట్ ఏజ్ 38. కానీ ప్రేమకి వయసుతో సంబంధం లేదుగా. అలా ప్రేమలో పడ్డ ఈ జంట డిసెంబర్ 9న జరిగే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. రాజస్థాన్ లో ఈ వివాహం జరుగుతోంది. మరి ఈ పెళ్లికి కంగన హాజరవుతుందా? ఆమెకు ఆహ్వానం అందిందా? లేదా? అన్నది ఇంకా బయటకు రాలేదు. 200 మంది గెస్ట్స్ జాబితాలో 120 మంది బాలీవుడ్ సెలబ్రిటీలుండగా.. కంగన పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు. మరి ఈ కామెంట్ ని ఆ జంట పాజిటివ్ గా తీసుకుంటే పర్వాలేదు. లేకపోతే కాబోయే నవదంపతుల మద్య పెద్ద చిక్కే వస్తుంది సుమీ.