ముంబై కోర్టులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన కు భారీ ఝలక్ తగిలింది. ప్రముఖ బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్ కంగనపై గతంలో పరువు నష్టం కేసుని దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీన్ని మరో కోర్టుకి బదిలీ చేయాలని కంగన ముంబై కోర్టుని కోరింది. దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేసిన ముంబై కోర్టు కంగన అభ్యర్థనని సున్నితంగా తిరస్కరించి గట్టి ఝలక్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ ప్రముఖ రచయిత, .. ఫేమస్ లిరిసిస్ట్ అయిన జావేద్ అక్తర్ పై ఇటీవల కంగన రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కంగన వ్యాఖ్యలపై ఆగ్రహించిన జావెద్ అక్తర్ ఆమెపై పరువు నష్టం కేసుని దాఖలు చేశారు. ముంబైలోని అంధేరిలో వున్న ట్రైయల్ కోర్టులో ఆయన కంగనపై కేసు పెట్టారు. అయితే ఈ కోర్టు నుంచి తన కేసుని మరో కోర్టుకి బదిలీ చేయాలంటూ ఇటీవల కంగన కోర్టులో ప్రత్యేక పిల్ వేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రయల్ కోర్టు జడ్జ్ ఆర్ ఆర్ ఖాన్.. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎస్.టి. దాండే కంగనకు గట్టి షాకిచ్చారు.
కంగన తరుపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ.. జావేద్ అక్తర్ తరుపు న్యాయవాది జై భరద్వాజ్ ల వాదనలు విన్న తరువాత న్యాయవాదులు పై విధంగా స్పందించారు. అంతే కాకుండా తను వ్యక్తగతంగా కోర్టులో హాజరు కాని పక్షంలో అరెస్ట్ వారెంట్ ని జారీ చేస్తామని కూడా హెచ్చరించారు. సీనియర్ సిటిజన్ అయిన జావేద్ అక్తర్ తాజా పరిస్థితుల్లోనూ క్రమం తప్పకుండా హాజరవుతున్నారని కానీ కంగన మాత్రం హాజరు కాకుండా కుంటి సాకులు చెబుతూ చివరికి ఈ కేసుని మరో కోర్టుకి తరలించాలని పిల్ వేసిందని జావేద్ అక్తర్ తరుపు న్యాయవాది వివరించారు దీంతో కంగనపై మండిపడిన మెజిస్ట్రేట్ కంగన కోర్టుకు రాకపోతే అరెస్ట్ వారెంట్ ని జారీ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.