బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత బోల్డో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఇప్పటికే ఎన్నో సంచలన కామెంట్లు చేసింది. సినీ పరిశ్రమలోని వ్యక్తులు పైకి మాట్లాడ్డానికి ఇష్టపడని చాలా విషయాలపై ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చింది. చాలామందిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. తాజాగా సినీ పరిశ్రమలోని చీకటి కోణాల గురించి తనదైన శైలిలో కామెంట్లు చేసింది కంగనా. సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో చాలామంది హీరోలు తనను లైంగికంగా వాడుకున్నారని ఆమె కామెంట్ చేసింది. గతంలోనూ ఇదే తరహాలో ఓసారి మాట్లాడిన కంగనా.. మరోసారి అదే మాటను నొక్కి వక్కాణించింది.
‘‘నేను ఇంతకుముందు అన్న మాటకు ఎప్పుడూ కట్టుబడే ఉంటాను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను హీరోలు.. ఇంకొందరు వాడుకున్నారు. అసలు స్టార్ హీరోయిన్లందరూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నవారే అని నా ఉద్దేశం. ఎవరో కొందరు సినీ కుటుంబ నేపథ్యం ఉన్నవారు తప్పిస్తే చాలామందికి నాకు ఎదురైన అనుభవాలే జరిగాయి. ఇవన్నీ జగమెరిగిన సత్యాలే. నేను ఆ విషయాలే చెబితే కొందరు భుజాలు తడుముకుంటున్నారు. నేను అన్న మాటలు తప్పు అని ఎవరూ ఇంతవరకూ పబ్లిగ్గా స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. అంటే నేను అన్నమాటలు నిజమే అని నా ఉద్దేశం’’ అని కంగనా కుండబద్దలు కొట్టేసింది. తాను మరీ బోల్డుగా మాట్లాడేస్తానన్న విమర్శలపై కంగనా స్పందిస్తూ.. ‘‘నిజాలు మాట్లాడితే అలానే భయపడతారు. నేను ఏదైనా అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి మాత్రమే మాట్లాడతాను. ఓపెన్ గా ఉంటాను. అబద్ధాలు చెప్పను. అందుకే నేను చెప్పిన మాటలను ఎవరూ ఖండించరు. అవన్నీ నిజాలే అని వాళ్లకూ తెలుసు’’ అని కంగన స్పష్టం చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/