బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా 'మణికర్ణిక' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలోని కంగనా నటనకు విమర్శకుల ప్రశంసలు అయితే దక్కాయి. కాని సినిమా దర్శకుడు మరియు కొంత మంది నటీనటులు ఆమె ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో విమర్శల పాలు అయ్యింది. దర్శకుడు క్రిష్ కు ఆమె క్రెడిట్ ఇవ్వలేదని, సినిమా మొత్తం క్రిష్ తీస్తే ఆమె కొంత ప్యాచ్ వర్క్ చేసి సినిమాను తన సినిమాగా చెప్పుకుంది అంటూ విమర్శలు ఎదుర్కొంది. కంగనా కెరీర్ లో ఇలాంటివి కొత్తేం కాదు.
ఎంతో మంది స్టార్ హీరోలు మరియు దర్శ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ తాజాగా తన బయోపిక్ ను తీసేందుకు సిద్దం అవుతోంది. తన బయోపిక్ కు తానే దర్శకత్వం వహించబోతుంది. అయితే మణికర్ణిక చిత్రానికి రచన సహకారం అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈమె బయోపిక్ కు రచన సహకారం అందించబోతున్నాడట. కంగనా కెరీర్ ఆరంభం నుండి ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయోపిక్ లో పొందు పర్చబోతున్నట్లుగా తెలుస్తోంది.
మామూలుగానే ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ బయోపిక్ లో మరెంతగా బాలీవుడ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తుందో అంటూ కొందరు ఇప్పటి నుండే టెన్షన్ పడుతున్నారు. ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలపై మరియు హీరోయిన్స్ పై కూడా ఆమద్య కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివాదాలను బయోపిక్ లో చూపిస్తే బాలీవుడ్ లో కల్లోలం మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.