`ఫ్యాషన్` చిత్రంతో మధుర్ భండార్కర్ జాతీయ అవార్డ్ మూవీ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా రేంజ్ అమాంతం స్కైని టచ్ చేసింది. ఇందులో కంగన దురలవాట్లతో కెరీర్ ని కోల్పోయిన సూపర్ మోడల్ పాత్రలో అద్భుతంగా నటించింది. సమకాలీన ప్రపంచంలో సంచలన విషయాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించడం మాధుర్ శైలి. నిజ జీవితాల్ని పరిశీలించి అద్భుతంగా విజువలైజ్ చేస్తారు.
త్వరలో భన్సాలీ ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కాశ్మీరీ గాయని కథను తెరపైకి తెస్తున్నారు. ఈ మూవీ కోసం కంగనా రనౌత్ - దర్శకుడు మధుర్ భండార్కర్ తో మళ్లీ కలిసి పని చేయనుంది.
కంగనా రనౌత్ ప్రస్తుతం ఇతర చిత్రాలతో బిజీగా ఉంది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో క్వీన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా వైరల్ గా దూసుకెళ్లింది. టీజర్ లో ఇందిర లుక్స్‌ని పోలిన పాత్రతో కంగన ఆకట్టుకుంది. ఇందిర తరహాలోనే కంగన వాయిస్ ని మార్చి నటించడం అభిమానులను ఆకట్టుకుంది.
ప్రఖ్యాత మిడ్ డే కథనం ప్రకారం... ఫ్యాషన్ సహా మరెన్నో చిత్రాలతో సంచలనాలు సృష్టించిన జాతీయ అవార్డు విజేత మధుర్ భండార్కర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కంగనను ఎంపిక చేసుకున్నారు. ఈ ఎంపిక బీ-టౌన్ లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రం నాయికా ప్రధాన కథాంశంతో రూపొందనుండడంతో కంగనకు జాక్ పాట్ తగిలిందన్న ముచ్చటా సాగుతోంది.
ప్రస్తుతం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో `బాబ్లీ బౌన్సర్` ని మాధుర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తన పనిని ముగించిన తర్వాత కంగన మూవీ పనిని ప్రారంభిస్తాడని తెలిసింది. టెర్రరిస్టుల చేతిలో హత్యకు గురైన కాశ్మీరీ గాయకుని కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ఇది నాయికా ప్రధాన చిత్రం.
దర్శకుడు మధుర్ భండార్కర్ 4 సార్లు జాతీయ అవార్డు గ్రహీత. ఎప్పటిలానే నిజజీవిత కథనే ఈసారి కూడా ఎంచుకున్నాడు. కంగనను నాయికగా ఫిక్స్ చేశాడు. తదుపరి సినిమా టైటిల్ -తేదీలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. నిర్మాత ఫిరోజ్ నదియాడ్ వాలా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఫ్యాన్స్ లో ఉత్సాహం..!
కంగనా రనౌత్ మధుర్ భండార్కర్ తో కలిసి పని చేయడం అభిమానులను ఎగ్జయిట్ చేయనుంది. నిజానికి ఈ జోడీ అద్భుతాలను చేసేందుకు ఆస్కారం ఉందని అభిమానుల్లో చర్చ సాగుతోంది. అయితే కంగన నటించిన నాయికా ప్రధాన చిత్రం ధాకడ్ ఫెయిల్యూర్ ఒక రకంగా కంగనకు పెద్ద మైనస్ గా మారింది.