ఆమె అరంగేట్రంలో దర్శకేంద్రుడి కోడలి హ్యాండ్

Update: 2017-09-05 16:37 GMT
రాఘవేంద్రరావు కోడలు కనిక ధిల్లాన్ తెలుసు కదా? బాలీవుడ్లో కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ కన్సల్టంట్ గా పని చేసి.. ఆ తర్వాత దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ కోవెలమూడితో ప్రేమలో పడి.. హైదరాబాద్ లో సెటిలైన ఉత్తరాది అమ్మాయి కనిక. టాలీవుడ్లోనూ ఆమె తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేసింది. ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన ‘సైజ్ జీరో’ సినిమాకు స్క్రిప్టు సమకూర్చింది ఆమే. ఐతే ఈ చిత్రం ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడు కనిక మళ్లీ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆమె స్క్రిప్ట్ కన్సల్టంట్ గా వ్యవహరిస్తుండటం.. ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూస్తుండటం విశేషం.

బాలీవుడ్ జనాలందరూ సైఫ్ అలీ ఖాన్ తనయురాలు సారా అలీ ఖాన్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కథానాయికగా పరిచయం కాబోతున్న ‘కేదార్ నాథ్’ సినిమాకే కనిక పని చేస్తోంది. ఈ చిత్రాన్ని ‘రాక్ ఆన్’.. ‘కై పోచే’.. ‘ఫితూర్’ చిత్రాల దర్శకుడు అభిషేక్ కపూర్ రూపొందిస్తున్నాడు. ‘ఎం.ఎస్.ధోని’ ఫేమ్ సుశాంత్ రాజ్ పుత్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. షూటింగుకి ముందే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఐతే అందులో హీరో హీరోయిన్ల ముఖాలేమీ చూపించలేదు. కాకపోతే బ్యాగ్రౌండ్ లో హీరో హీరోయిన్ని ముద్దాడుతున్నట్లు షాడోలో చూపించి.. కేదార్ నాథ్ కు సంబంధించిన దృశ్యాల్ని పొందుపరిచారు. ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు అభిషేక్ సహ నిర్మాత.
Tags:    

Similar News