ముచ్చెమటలు పట్టిస్తున్న కనికపై మ‌ర్డ‌ర్ కేసు?

Update: 2020-03-25 05:10 GMT
పాపులర్‌ సింగర్‌ కనికా కపూర్‌ ఇప్పుడు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కరోనా వైరస్ పాజిటివ్ అని తెలిశాకా.. వైద్యులు.. పోలీసులు చెప్పిన సూచనలు పాటించకుండా తనకు ఇష్టారాజ్యంగా జ‌న స‌మూహాల్లో అంట‌కాగ‌డంతో అది సంచ‌ల‌న‌మైన సంగ‌తి విదిత‌మే. దీంతో మండిపోయిన పోలీసులు క‌నిక‌పై ఊగిపోతున్నారు. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఆమెపై మర్డర్‌ కేసులు పెట్టాలని భావిస్తున్నారు. మరి అంతగా కనికా కపూర్‌ ఏం చేస్తుందనేది  చూస్తే...

ఇటీవల లండన్ నుంచి లక్నోకి వచ్చిన ఈ హాట్‌ సింగర్‌ తన సమాచారాన్ని అధికారులకు ఇవ్వకుండా ఎయిర్ పోర్టు నుంచి పోలీసుల కళ్ళు గప్పి హోటల్ కు చేరుకోవడం తెలిసిందే. అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయినా పట్టించుకోకుండా రాజకీయ ప్రముఖులు వసుంధర రాజే- ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ తదితరులు పాల్గొన్న భారీ విందుల్లో పాల్గొంది. దీంతో వాళ్ళకి వైరస్‌ ఏమైనా సోకిందా అనే అనుమానాలు కలిగాయి. వారికి టెస్ట్ లు చేయగా నెగెటివ్ అని తేలింది.

ఫైనల్‌ గా కనికని గుర్తించి లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ లో ఉంచి ప్రత్యేకంగా చికిత్సను అందిస్తున్నారు. ఆసుపత్రిలో కూడా తను ఓవరాక్షన్‌ చేయడంతో పోలీసులు సీరియస్‌ అయ్యారు. గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చారట. తనకు వైరస్‌ ఉందని తెలిసినా కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆమెపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందు వల్ల ఆమెపై మర్డర్‌ కేసులు పెట్టాలనుకుంటున్నారట.

ఇదిలా ఉంటే తనతోపాటు తిరిగిన స్నేహితురాలు ఓజాస్‌ దేశాయ్‌ కి టెస్ట్ లు చేయగా.. ఆమెకి పాజిటివ్‌ అని తేలింది. దీంతో అప్పట్నుంచి ఓజాస్ ని వెతికే పనిలో పోలీసులు బిజీ అయ్యారు. ఓవైపు కరోనా ఇంత తీవ్రమవుతూ.. ప్రభుత్వానికి... పోలీసులకు.. వైద్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే ఓ ప్రముఖ సెల‌బ్రిటీ పోజిషియన్ లో ఉన్న ఇలాంటి వారు ఇంతటి నిర్లక్ష్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. క‌నిక‌పై కఠిన చర్యలు తీసుకోవాలని... ఇలాంటి వారిని ఊరికే వదిలి పెట్ట కూడదని నెటిజనులు మండిపడుతున్నారు. మరోవైపు ఆమె వైద్యానికి సరిగా సహకరించకపోవ‌డంతో ఛీప్ మెడికల్ ఆఫీసర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 14 రోజుల పాటు స్వీయ గృహనిర్భంధంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు.
Tags:    

Similar News