'గుర్తుందా శీతాకాలం' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోంది కన్నడ బ్యూటీ కావ్యాశెట్టి. మాతృభాషలో బిజీ నటిగా కొనసాగుతోన్న అమ్మడికి అవకాశం చాలా కాలం క్రితమే వచ్చింది. కానీ సినిమా రిలీజ్ ఆలస్యమవ్వడంతో కావ్యాశెట్టి వైరల్ కాలేదు. తాజాగా సినిమా రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో సినిమా సహా కొన్ని పర్సనల్ విషయాలు సైతం షేర్ చేసుకుంది.
శీతాకాలం సినిమాలో మూడు దశల్లో సాగే ప్రేమ కథలు ఉంటాయట. ఇందులో బ్యూటీ సత్యదేవ్ కి కాలేజీ గాళ్ ప్రెండ్ పాత్రలో కనిపించనుందిట. ఇప్పటి స్మార్ట్ ఫోన్లు అందుబాటు లో లేని రోజులు కాకుండా అప్పుడప్పుడే ఫోన్లు అందుబాటులోకి వస్తోన్నరోజుల్లో సాగే ప్రేమకథ ఇది. ఆన్ సెట్స్ లో ఆ పాత కాలపు సన్నివేశాల్లో నటించేటప్పుడు అమ్మడికి కాలేజీ రోజులన్నీ కళ్లు ముందు కనబడ్డాయట.
అమ్మాయిలు..అబ్బాయిలతో తాను చేసిన స్నేహాలు మొత్తం ఒక్కసారిగా కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయట. ఆనాటి చిలిపి పనులు..అల్లరి చిల్లర పనులు అన్నీ గుర్తు చేసుకుని నవ్వేసింది. శీతాకాలం టైటిల్ పెట్టడానికి ఓ బలమైన కారణం కనిపిస్తుంది. ఇందులో ప్రేమ కథలన్ని శీతాకాలంలో సాగుతాయట. అందుకే గుర్తుందా శీతాకాలం అంటున్నాం అంటోంది.
బెంగుళూరు బ్యూటీ కాబట్టి ఎప్పుడూ చల్లని వాతావరణమే కోరుకుంటుందిట. అలాగే భాష పరంగా ఎలాంటి వ్యత్యాసం లేదని తెలిపింది. అన్ని పరిశ్రమలకు సమానమే అంటుంది. కన్నడ నాయికలు తెలుగులో రాణిస్తున్నారు. అక్కడ కూడా ఇతర భాషల హీరోయిన్లు బిజీగా కొనసాగుతున్నారు. కథల విషయంలో తొందరపడకుండా సెలక్టివ్ గా వెళ్తానంటోంది.
శీతాకాలం రిలీజ్ తర్వాత వచ్చే ఆఫర్లు బట్టి తన నిర్ణయాలు ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం కన్నడలో మూడు సినిమాలతో పాటు..ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కన్నడ బ్యూటీలో యువతని ఆకట్టుకునే క్వాలిటీలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అందం..అభినయం పరంగా కన్నడిగుల్ని ఎంచడానికేం? లేదు. సక్సెస్ అయితే తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. మరి ఆ కోవలో కావ్యాశెట్టి నిలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.