కన్నడ సినిమా అంటే దక్షిణాదిలో ఇతర భాషల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి వుండేది కాదు. ఏదో వస్తున్నాయి.. పోతున్నాయి అని అనుకునే వారు. హిట్ అన్నా సరే ఇతర భాషల సినీ లవర్స్ పెద్దగా రియాక్ట్ అయ్యే వారు కాదు. కానీ ఎప్పుడైతే యష్, ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్`తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారో అప్పటి నుంచే కన్నడ సినిమా వైపు యావత్ ప్రపంచం ఆశ్చర్యంతో ఆసక్తిగా చూడటం మొదలు పెట్టింది. గతంలో కన్నడ సినిమా అంటే తెలియని వారు కూడా ఇప్పడు కన్నడ సినిమా వస్తోందంటే ఆసక్తిగా ఆరాతీయడం మొదలైంది.
గతంతో పోలిస్తే ఇప్పడు కన్నడ సినిమా విషయంలో సీన్ మారింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు ఊహించని విధంగా పాన్ ఇండియా సినిమాలు విడుదలై వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టించడమే కాకుండా కన్నడ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ సిరీస్ సినిమాలతో కన్నడ సినిమా వస్తోందంటే దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అటెన్షన్ మొదలైంది. గతంలో అనువాద హక్కుల కోసం ఆసక్తి చూపని ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు కన్నడ సినిమాల కోసం పోటీపడుతున్నారు.
అంతే కాకుండా నిర్మాణంలో వున్న సినిమాలపై కూడా పలువురు ప్రొడ్యూసర్స్ మునుపెన్నడూ లేని విధంగా ఆరా తీయడం ప్రారంభించడంతో కన్నడీగుల క్రియేటివిటీ ప్రపంచాన్ని ఆకర్షించడం మొదలు పెట్టిందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. `కేజీఎఫ్` వేసిన బాటలో `కేజీఎఫ్ 2` వంటి ట్రెమండస్ హిట్ తరువాత కన్నడ ఇండస్ట్రీ దేశ వ్యాప్తంగా జోరు చూపించడం మొదలు పెట్టింది. రక్షిత్ శెట్టి `చార్లీ 777, కిచ్చా సుదీప్ `విక్రాంత్ రోణ` వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగేలా చేశాయి.
అయితే తాజాగా విడుదలైన `కాంతార` ఇప్పడు కన్నడ ఇండస్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చేలా చేస్తోంది. ప్రాంతీయ సినిమా విడుదలైన ఈ మూవీ ఇప్పడు పాన్ ఇండియా వండర్ గా మారింది. తెలుగు, మిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది. పక్కా కన్నడ నేటివిటీతో దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి నటించి రూపొందించిన ఈ మూవీ కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేశారు. తెలుగులోనూ భారీ క్రేజ్ ని దక్కించుకుని హౌస్ ఫుల్స్ అవుతున్న ఈ మూవీ సరికొత్త చర్చకు తెరతీస్తోంది.