మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1'. దాదాపు 30 ఏళ్లకు పైగా ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేసిన మణిరత్నం ఎట్టకేలకు తెరపైకి తీసుకొచ్చారు. కల్కీ కృష్ణ మూర్తి ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో నిర్మించిన ఈ మూవీ తమిళంలో మినహా ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలుకపోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 400 కోట్లు వసూళ్లని రాబట్టి రికార్డులు సృష్టిస్తోందని మేకర్స్ చెబుతున్నా ఇప్పటికీ తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ ని సాధించలేకపోయింది. రూ. 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పీరియాడిక్ డ్రామా ఏ విషయంలోనూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతోంది. భారీ సెట్టింగ్ లు, గ్రాండ్ విజువల్స్, వినసొంపైన సంగీతం వున్నా ఈ భారీ సినిమాకు కావాల్సింది లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు.
ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని చూపించకపోవడంతో తమిళ ప్రేక్షకులు మన వాళ్ల టేస్ట్ పై కామెంట్ లు చేయడం తెలిసిందే. అయితే పక్కా తమిళ నేటివిటీ కథ కావడం, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎమోషన్స్ లేకపోవడమే 'పొన్నియిన్ సెల్వన్ 1'కు ప్రధాన మైనస్ గా మారిందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా విడుదలైన కన్నడ మూవీ 'కాంతార'కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి కారణం ఆ మూవీ తెలుగు నేటీవిటీ లేకపోయినా కదిలించే ఎమోషన్స్ వుండటం వల్లే ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఆ కారణంగానే 'కాంతార' ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు రోజులకే ఐదు కోట్ల షేర్ ని రాబట్టిందని చెబుతున్నారు. ఈ సినిమా రిజల్ట్ గీతా ఆర్ట్స్ తో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ని షాక్ కు గురిచేస్తోంది. 'పొన్నియిన్ సెల్వన్ 1' భారీ హంగులతో రూపొందినా అందులో లేని ఎమోషన్ 'కాంతార'లో వుండటం వల్లే దాన్ని పక్కన పెట్టి 'కాంతార'కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
హిందీ తో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటూ భారీ విజయాన్ని అందిస్తున్నారు. ఊహించని విధంగా రికార్డు స్థాయి వసూళ్లని సాధిస్తుండటంతో 'కాంతార' ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.