'కాంతార' ఓ కన్నడ సినిమా.. ఉడిపి, మంగళూర్ రిజియన్ లో ప్రముఖంగా కనిపించే భూతకోల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. 1887, 1970 అండ్ 1990ల కాలంలో ఆదివాసీల కథగా ఈ మూవీని రూపొందించారు. విష్ణు మూర్తి అవతారాల్లోని వరాహ రూపాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ కర్ణటకలోని ఓ తెగ వారి ఆచార వ్యవహారాలకు అద్దంపడుతూ మనుషులంతా సమానమేననే కాన్సెప్ట్ తో రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించాడు. 'కేజీఎఫ్' మేకర్స్ హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించారు.
కన్నడ నేటివిటీ నేపథ్యంలో సప్తమి గౌడ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదలై అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ రీసెంట్ గా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదలై బాక్సాఫీస్ వద్ద దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు రూ. 22 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది.
ఇదిలా వుంటే దేశ వ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంటున్న ఈ మూవీపై మునుపెన్నడూ లేని విధంగా స్టార్స్, క్రిటిక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఈ సినిమాని ఎట్టపరిస్థితుల్లోనూ మిస్సవ్వొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ నుంచి కోలీవుడ్ స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరూ ఈ మూవీని ప్రత్యేకంగా చూడటమే కాకుండా చిత్ర బృందాన్ని, హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందుగా స్పందించారు. ఇప్పటికే ఈ మూవీని రెండు సార్లు చూశానని, రోమాంచిత అనుభూతి కలిగిందని చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించాడు. ఆ తరువాత అనుష్క కూడా సోషల్ మీడియా వేదికగా ఈ మూవీని కొనియాడింది. సినిమాని ఎవరు మిస్ కావద్దంటూ పోస్ట్ పెట్టింది. 'కాంతార' ప్రేక్షకుల్ని థియేటర్లలోకి రప్పించడానికి స్టార్స్, భారీ బడ్జెట్, మేకింగ్ వ్యాల్యూస్ అని మేకర్స్ ఆలోచిస్తున్న వేళ 'కాంతార' వారికి గట్టి గుణపాఠాలు నేర్పుతోందని, ఎలాంటి స్టార్స్ లేకపోయినా సరే కంటెంట్ స్ట్రాంగ్ గా వుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'కాంతార' రుజువు చేసిందని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ మూవీని ఖచ్చితంగా చూడాలన్నారు.
ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 'కాంతార'పై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూశానని, ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే వుందని, ఇదొక అద్భుతమైన అనుభవం అని తెలిపింది. అంతే కాకుండా సాంప్రదాయం,చ జానపదకథలు, దేశీయ సమస్యల పమ్మేళనమే ఈ సినిమా. రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం.. అన్నీ మరో స్థాయిలో వున్నాయి. ప్రకృతి అందాలని చూపించిన విధానం.. యాక్షన్ ఘట్టాలని తెరకెక్కించిన తీరు అద్భుతం. సినిమా అంటే ఇది' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించింది.
తమిళ వెర్షన్ ని ప్రత్యూకంగా వీక్షించిన హీరో కార్తి ప్రత్యేకంగా రిషబ్ శెట్టిన ఆలింగనం చేసుకుని అభినందించడమే కాకుండా సినిమాని తప్పకుండా అందరూ చూడాలని కోరడం విశేషం. తమళం నుంచి శరత్ కుమార్, బాలీవుడ్ డైరెక్టర్ మధూర్ బండార్కర్, శిల్పాశెట్టి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా గూస్ బంప్స్ తెప్పించిందని, ఫొటోగ్రఫీ, సంగీతం, డైరెక్షన్, రిషబ్ శెట్టి నటన నెక్ట్స్ లెవెల్లో వున్నాయన్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, స్టార్స్, క్రిటిక్స్ ఈ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తూనే సినిమాని అందరూ చూడాలంటూ యునానిమస్ గా ప్రమోషన్స్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.