'నాకు ఇతరుల సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ'

Update: 2022-10-11 04:48 GMT
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ''కాఫీ విత్ కరణ్‌‌'' టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సెలబ్రిటీ టాక్ షో ఎంతగా పాపులారిటీ తెచ్చుకుందో.. అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇందులో గెస్టులుగా వచ్చే సెలబ్రిటీలను కరణ్ అడిగే ప్రశ్నలు.. డిస్కస్ చేసే అంశాలపై ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.

ఇటీవలే కాఫీ విత్ కరణ్‌‌ టాక్ షో ఏడో సీజన్‌ ముగిసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబడిన ఈ ప్రోగ్రామ్ కి విశేష స్పందన లభించింది. షోకి వచ్చిన గెస్టుల వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు కరణ్ జోహార్. ఎప్పటిలాగే సెక్స్ లైఫ్ మరియు ఎఫైర్స్ గురించిన అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు.

హీరోహీరోయిన్లతో పాటుగా హీరోయిన్ల తల్లులను కూడా కరణ్ ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా అతిథుల శృంగార జీవితంపైనే ప్రశ్నలు అడగడంతో ఈ సీజన్ లో కూడా నెటిజన్లు పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్‌ జోహార్ స్పందించాడు.

కరణ్ మాట్లాడుతూ.. నేను నాకు నచ్చింది చేయాలని అనుకున్నాను. టాక్ షో చేయడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. అయితే చాలా మంది నేను అలియా గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఇతరుల లైంగిక జీవితాల గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నానని విమర్శలు చేస్తున్నారు. అది నిజమే కావొచ్చు. కానీ నేను ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు.

బహుశా నాకు ఇతర వ్యక్తుల లైంగిక జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉందేమో. అందుకే అలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను అనుకుంటా. అలాగే అలియా భట్ ని చూసి నాకు చాలా గర్వంగా ఉండి ఉండొచ్చు.. అందుకే ప్రతి సారి ఆమె పేరు తీస్తున్నానని అనుకుంటా అని చెప్పాడు.

ఏదేమైనా ట్రోల్స్ కి మనమే స్వయంగా రిప్లై ఇవాల్సి ఉంటుంది. ఇక్కడ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఇది కేవలం టాక్ షో. అందులో రకరకాల ప్రశ్నలు వేస్తుంటాను. అంతేకానీ ఎక్కువగా ఆలోచించను. కానీ కొందరు వాటినే ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తుంటారురు. ఎందుకో నాకు అర్థం కాదు. అయినా వాటిని నేను పట్టించుకోను అని కరణ్ జోహర్ చెప్పుకొచ్చాడు.

అయితే కరణ్ జోహార్ షోలో పలువురు స్టార్ సెలబ్రిటీలు కొందరు డైరెక్టుగానే అన్ని విషయాలకు సమాధానాలు చెప్పి ఆశ్చర్య పరిచారు. కొందరు హీరోయిన్స్ కూడా సెక్స్ లైఫ్ విషయంలో చాలా ఓపెన్ గా బోల్డ్ గా వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఈ షో ద్వారా కొన్ని సీక్రెట్స్ బయటపెట్టేసాడు.

ఇకపోతే కరణ్ జోహార్ త్వరలోనే కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ తో రాబోతున్నట్లు ప్రకటించాడు. మరోవైపు తన ధర్మ ప్రొడక్షన్స్ పై పలు సినిమాలు - వెబ్ సిరీసుల నిర్మాణం చూసుకుంటున్నాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టుకొని.. అలియా భట్ - రణ్‌ వీర్ సింగ్‌ జంటగా ఓ రొమాంటిక్ లవ్‌ స్టోరీకి దర్శకత్వం వహిస్తున్నాడు కరణ్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News