బాహుబలి తర్వాత ఇది తెగ నచ్చేసింది

Update: 2015-06-08 15:54 GMT
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్‌ ఉందని నిరూపించాడు కరణ్‌జోహార్‌. బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల్ని తెరకెక్కించిన అనుభవజ్ఞుడు. ఇటీవలి కాలంలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రాన్ని హిందీలో రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి హిందీ వెర్షన్‌కి కరణ్‌ పంపిణీదారుడిగా, సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో అతడికి విపరీతంగా నచ్చేసిన విజువల్స్‌ ఏవైనా ఉన్నాయి అంటే అది బాహుబలికి సంబంధించినవే. టీజర్‌, ట్రైలర్స్‌ చూసి మతిపోయిందని కితాబిచ్చాడు. ఇప్పుడు మరో సినిమా అదే రేంజులో నచ్చేసింది. ధనుష్‌-వేట్రిమారన్‌ జోడీగా ఫాక్స్‌ స్టార్‌ ఇండియాతో కలిసి నిర్మించిన సినిమా ఇది. టైటిల్‌ కాక ముట్టాయ్‌. ఇద్దరు వీధి బాలకులు (వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ పొట్ట పోషించుకునే పిల్లలు) పిజ్జా తినాలన్న కోరిక తీర్చుకోవడానికి ఏం చేశారన్నదే కథాంశం. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ.3కోట్లు వసూలు చేసి అద్భుతాలు సృష్టించింది.

'చిన్న సినిమా.. గొప్ప హృదయం' అంటూ కరణ్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చేశాడు కరణ్‌ జోహార్‌. జాతీయ అవార్డ్‌ సాధించిన సినిమా ఇది.  కదిలించేసింది... అంటూ చెప్పుకొచ్చాడు. ప్రయోగాలు చేయాలంటే తంబీల తర్వాతే మరి.


Tags:    

Similar News