రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' పార్ట్ -1 రిలీజ్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఈ సినిమాని హిందీలో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్‌జోహార్ ఈ సినిమా హిందీ హక్కుల్ని కొనుక్కున్నారు. ఇప్పట్నుంచే ప్రచారం హోరెత్తిస్తున్నారు. అంతేకాదు అక్కడ హిందీ సినిమాల రిలీజ్ తేదీలపై పక్కాగా సమాచారం సేకరించి బాహుబలి రిలీజ్ తేదీని నిర్ణయించాలని కరణ్ భావిస్తున్నారు.
ఆ మేరకు ఖాన్స్, కపూర్స్ సినిమాలన్నీ ఏ తేదీల్లో రిలీజవుతున్నాయో పక్కాగా స్కాన్ చేస్తున్నారని టాక్. ఎలాంటి పోటీ లేకుండా సోలోగా వస్తే బాహుబలి వసూళ్లకు ఢోఖా ఉండదని కరణ్ భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు తెలుగు రిలీజ్ కంటే హిందీ రిలీజ్‌కి అత్యంత ప్రాధాన్యత పెరిగింది. హిందీ రిలీజ్ తేదీని మరింత ముందుకు తెచ్చే ఆస్కారమూ లేకపోలేదని సమాచారం. ప్రస్తుతం బాహుబలి నిర్మాణానంతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో ఓ ఐటెమ్ నంబర్ సంథింగ్ స్పెషల్‌గా ఉంటుందని టాక్. 'బాహుబలి- ది బిగినింగ్' పేరుతో హిందీలో రిలీజవుతుంది. ప్రస్తుతం అక్కడ డబ్బింగు పనులు కూడా సాగుతున్నాయి. అదీ సంగతి.