మళ్లీ ప్రభాస్- రాజమౌళి కాంబో!?

Update: 2017-04-18 06:41 GMT
ఏ స్టార్ హీరోతో అయినా రాజమౌళి సినిమా చేస్తున్నాడని తెలిస్తే.. ఆ హీరో అభిమానులు సంబరాల్లో మునిగిపోతారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆలోచనలో పడిపోతారు. సక్సెస్ గ్యారంటీ అని సంతోషించాలో.. ఎన్నేళ్లు ఎదురుచూడాలో అని బాధపడాలో తెలియని సంకట స్థితి ఎదురవుతుందనే భయమే ఇందుకు కారణం.

ఈ నెల 28న బాహుబలి 2 రిలీజ్ కానుండగా.. దీని తర్వాత రాజమౌళి సినిమా ఏంటనే ప్రశ్న బాగానే చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు కరణ్ జోహార్ దీనికి ఓ సమధానం అందించేందుకు ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళితో డైరెక్ట్ హిందీ సినిమా చేయించాలన్నది దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆలోచన. అందుకు సబంధించి ప్రయత్నాలు.. బలవంతాలు బాగానే పెట్టేస్తున్నాడు. అలాగే ఈ సినిమా ప్రభాస్ కు హిందీ లాంఛింగ్ మూవీ చేయాలని చూస్తుండడమే అసలైన విషయం. కరణ్ జోహార్ నిర్మాతగా.. రాజమౌళి దర్శకత్వం.. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ అనే ఆలోచనే.. కొత్త చరిత్రకు నాంది అనిపించక మానదు.

అయితే.. ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ రొమాంటిక్ జోనర్ లో తీయాలన చూస్తున్నాడట కరణ్ జోహార్. ఇప్పటికే బాహుబలి ది కంక్లూజన్ కు పనులన్నీ అయిపోయాయి. సెన్సార్ చేయించేశారనే టాక్ కూడా ఉంది. ప్రీ రిలీజ్.. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ చేసుకుని.. ఐదేళ్ల కష్టం బాహుబలి ఇచ్చిన ఆనందాన్ని అనుభవించడమే. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా.. రాజమౌళి బాలీవుడ్ మూవీ మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News