బాహుబలి ది కంక్లూజన్.. ఇండియా మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. మొదటి భాగంలో వదిలేసిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. బాహుబలి సీక్వెల్ హిందీ వెర్షన్ విషయంలో ఇప్పటివరకూ ఉన్న ఓ డౌట్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
బాహుబలి కి రేటు బాగా ఎక్కువ చెప్పడంతో.. రెండో భాగాన్ని కరణ్ జోహార్ కొనలేదనే టాక్ వినిపించింది. అయితే.. తాజాగా విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ హిందీ వెర్షన్ పోస్టర్ ను స్వయంగా ట్వీట్ చేశాడు కరణ్ జోహర్. 'బాహుబలి నుంచి మరో అద్భుతమైన దృశ్యం. ఏప్రిల్ లో రిలీజ్ కానుంది' అంటూ ట్వీట్ చేసిన కరణ్ జోహార్.. హిందీ వెర్షన్ కి సంబంధించిన పోస్టర్ ని ట్వీట్ చేశాడు. ఇందులో ధర్మ ప్రొడక్షన్స్.. ఏఏ మూవీస్ అనే బ్యానర్లతో పాటు.. కరణ్ జోహార్ అండ్ ఏఏ ఫిలిమ్స్ ప్రెజెంట్స్ అంటూ నేమ్ కార్డ్స్ వేసేశారు.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పడిందంటే.. బాహుబలి ది కంక్లూజన్ ను కచ్చితంగా కరణ్ జోహార్ కొనుగోలు చేసినట్లే. ఏఏ ఫిలిమ్స్ అంటే అనిల్ థండాని అన్నమాట. ఈయన ఓ డిస్ట్రిబ్యూటర్. ఎక్కువగా కరణ్ జోహార్ తోనే ఈయన భాగస్వామ్యం ఉంటుంది. రెండు బ్యానర్లు కనిపిస్తున్నా.. బాహుబలి ది కంక్లూజన్ హిందీ వెర్షన్ దాదాపుగా కరణ్ జోహార్ చేతిలో ఉన్నట్లే అనే విషయం అర్ధమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/