శ్వేతా బసు ప్రసాద్.. తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోయే పేరు కాదు ఇది. ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో చక్కటి పెర్ఫామెన్స్ తో మంచి పేరు సంపాదించి.. చాలా త్వరగా ఫేడవుట్ అయిపోయిన ఈ భామ రెండేళ్ల కిందట ప్రాస్టిట్యూషన్ కేసులో చిక్కుకుని చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. ఆ కేసులో తన ప్రమేయం ఎంత అన్నది పోలీసులు కూడా తేల్చలేకపోయారు. శ్వేత ఆ వివాదంలో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్న సమయంలో టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు.. ఆమెను ఆదుకుంటామని.. అవకాశాలిస్తామని హామీలు ఇచ్చారు. ఐతే ఆమె వీళ్లను సంప్రదించిందో లేదో కానీ ఇక్కడైతే మళ్లీ సినిమాలేవీ చేయలేదు. అసలు హైదరాబాద్ వైపు చూడ్డానికి కూడా ఇష్టపడలేదు.
ముంబయిలో టీవీ కార్యక్రమాలేవో చేసుకుంటూ.. డాక్యుమెంటరీలు తీసుకుంటూ గడిపేస్తున్న శ్వేతకు అక్కడ కూడా సినిమాల్లో అవకాశాలేమీ రాలేదు. ఇక మళ్లీ ఆమెను సినిమాల్లో చూడ్డం కష్టమే అనుకుంటుండగా.. శ్వేతకు ఒక బంపర్ ఆఫర్ తగిలింది. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోయే తర్వాతి సినిమాలో ఆమెకు ఓ రోల్ ఆఫర్ చేశారు. మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను ఒప్పేసుకుంది శ్వేత. ఆ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. అసలు ఏదో ఒక సినిమాలో అవకాశం వస్తే చాలు అనుకుంటుంటే ఏకంగా.. కరణ్ సినిమాలో ఛాన్స్ అంటే శ్వేత కెరీర్ మలుపు తిరిగినట్లే. చిన్నతనంలోనే నటిగా మంచి పేరు సంపాదించి.. జాతీయ అవార్డు కూడా గెలిచిన అమ్మాయి కెరీర్ ను సరిగ్గా తీర్చిదిద్దుకుని ఉంటే ఈ పాటికి ఏ స్థితిలో ఉండేదో.