అందాల నటీమణులతో వర్క్ చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. అందులోనూ నటనలో రాటు దేలినవారు ఉంటే వారి వయసుతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తారు. అలాంటి అన్ని కోణాలు ఉన్న శ్రీదేవితో కూడా చాలా మంది వర్క్ చేయాలని అనుకున్నారు. చివరగా మామ్ అనే సినిమాతో వచ్చిన శ్రీదేవి ఆ తరువాత కూడా కొన్ని కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. భారీ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి.
అయితే ఇంతలో శ్రీదేవి మరణం అభిమానులను సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖులను ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయిదు పదుల వయసులో కూడా అందంగా కనిపిస్తోన్న శ్రీదేవి నుంచి మరో సినిమా రాకపోదా అలాగే సినిమా ప్రముఖులు కూడా మరో సినిమా ఆమెతో చేయకపోతామా అని చాలా వెయిట్ చేశారు. కానీ అందరి ఆశలు ఆమె మరణంతో గాలిలో కలిసిపోయాయి. ముఖ్యంగా ధర్మ ప్రొడక్షన్ అధినేత కరణ్ జోహార్ ఒక మంచి సినిమాను తీయాలని ప్లాన్ వేసుకున్నారట. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ లో కరణ్ ఫాదర్ యాశ్ జోహార్ 25 ఏళ్ల క్రితం శ్రీదేవితో గుమ్రా అనే సినిమాను తెరకెక్కించారు.
ఆ సినిమాలో సంజయ్ దత్ హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా మంచి రిజల్ట్ అందించడంతో మరో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ 2004లో యాశ్ జోహార్ కన్నుమూయడంతో ఆ ప్రాజెక్ట్ కలలా మిగిలిపోయిందని అంతా అనుకున్నారు. కానీ కరణ్ మాత్రం శ్రీదేవితో సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ మధ్య కాలంలో ఓ సినిమా రాబోతోంది అని చాలానే కథనాలు వెలువడ్డాయి. కానీ ఏ సినిమా రాలేదు. రీసెంట్ గా కరణ్ ఆమె కూతురితో ధడఖ్ అనే సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీదేవితో కూడా స్టార్ట్ చేయాలని కరణ్ మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తుండగా ఇంతలో విషాదం చోటు చేసుకుంది.