రణబీర్ కపూర్-వాణీ కపూర్- సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన `షంషేరా` ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. జులై 22న రిలీజ్ అయిన పీరియాడిక్ చిత్రం దాదాపు 150 కో ట్ల బడ్జెట్ తో నిర్మించి రిలీజ్ చేసారు. కానీ తొలి షోతోనే సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. పైన పటారం..లోన లొటారం తప్ప సినిమాలో ఏముందని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కున్నారు.
ఈ ప్లాప్ సినిమాకి 150 కోట్లు ఖర్చు చేసారు? అంటూ నెటి జనులు మండిపడ్డారు. ఇక రణబీర్..సంజయ్ దత్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇద్దరు నెట్టింట ట్రోలింగ్ బారినపడ్డారు. కష్ట కాలంలో ఉన్న బాలీవుడ్ ని ఈ సినిమా ఫలితంతోనే బయటపడుతుందని ఆశలు పెట్టకున్నా..అన్ని ఒమ్ము అయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద సినిమా 54 కోట్ల వసూళ్లని మాత్రమే తేగలిగింది. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. తాజాగా సినిమా వైఫల్యం గురించి దర్శకుడు కరణ్ మల్హోత్రా ట్వీటర్ వేదికగా స్పందించారు. ఓ హృదయ విదారక పోస్ట్ చేసారు.
`నా ప్రియమైన షంషేరా పై మీరంతా ఎలా ఉన్నారో అర్ధం చేసుకోగలను. ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఈ ప్లాట్‌ఫారమ్‌లో నన్ను నేను వ్యక్తీకరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడే మీ పట్ల ప్రేమ.. ద్వేషం.. వేడుక ..అవమానాలు అన్నీ ఉన్నాయి.
నేను ద్వేషం మరియు ఆవేశాన్ని భరించలేక గత కొన్ని రోజులుగా ట్విటర్ కి దూరంగా ఉన్నాను.
కానీ ఇప్పడు మీ ముందుకు క్షమాపణలు చెప్పడానికి వచ్చాను. నా బలహీనతని సమర్ధించను. ప్రేక్షకులదే తుది నిర్ణయం. దాన్ని నేను ఎప్పుడు స్వీకరిస్తాను. మంచి..చెడు అన్నింటిని సమానంగా ఒప్పుకుంటా. నా మీద నమ్మకం ఉంచి నా సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇది నాకెంతో గౌరవం` అని రాసుకొచ్చారు.
కరణ్ మల్హోత్రా గతంలో `అగ్నీపథ్`..`బ్రదర్స్` లాంటి బ్లాక్ బస్టర్లు అందించారు. ఆ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అయ్యాయి. `షంషేరా`తో హ్యాట్రిక్ కొడతాడని చాలా మంది భావించారు. కానీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమా ని తెరకెక్కించారు. కథ పై చాలా కాలం అధ్యయనం చేసారు. అటుపై సెట్స్ కి తీసుకెళ్లడం..పూర్తిచేయడం అన్నీ ఆలస్యంగానే జరిగాయి.