రాజకీయ పార్టీ కాదంటూనే రాజకీయాలు చేయడం ఎక్కడైనా చూశారా? అది ఒక్క మా అసోసియేషన్ కే సాధ్యం. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఒకరిమీద ఒకరు పోటీకి దిగుతారు. తీవ్ర విమర్శలతో చెలరేగుతారు. నిండా మునిగాక చలెందుకు? అనుకునే బాపతే కనిపిస్తారు. `మా` సంఘం ఈ నాలుగేళ్లలో మసక బారిందనే నాగబాబు వ్యాఖ్యలకు నరేష్ ప్రెస్ మీట్ సాక్షిగా కౌంటర్ వేసారు. ఆ వ్యాఖ్యను తీవ్రంగా తప్పుబట్టారు.
అంతేకాదు మహిళకే ఈసారి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని కొత్త పల్లవి అందుకున్నారు. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూనే ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. తాజాగా మహిళ పోటీ చేస్తే గెలిపిస్తామంటూ నటి కరాటే కళ్యాణి అనడం ఆసక్తిని కలిగించింది.
కళ్యాణి మాట్లాడుతూ.. మహిళకు అవకాశం ఇస్తే మేము తప్పక సపోర్ట్ చేస్తామన్నారు. పని చేసేవాళ్లను చేయలేదనడం బాధగా ఉందని వ్యాఖ్యానించడమే గాక మద్రాస్ వెళ్లి కుర్చీ కావాలంటే మాకు ఇస్తారా? అంటూ నాన్ లోకల్ ఇష్యూని రైజ్ చేశారు. కుర్చీ మీద ఎందుకు మీకు అంత మమకారం అని ప్రశ్నించారు. మా లో కుర్చీ కావాలనుకుంటే సేవ చేయాలని అన్నారు. అన్నట్టు కరాటే కళ్యాణి మద్ధతు జీవితకా.. హేమకా అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు. మహిళా ఆర్టిస్టులంతా మహిళకే పట్టంగట్టాలనుకుంటే అది వారికి కలిసొచ్చే అంశమే.