అమ్మతనం... ప్రతీ మహిళ జీవితంలోనూ అదో తీయని అనుభవం! తన గర్భంలో మరో ప్రాణికి జీవం పోస్తున్నా అని తెలిసిన దగ్గరి నుంచీ ఎన్నో భావేద్వేగాలకు మహిళలు గురౌతూ ఉంటారు. తన రక్తం పంచుకుని - పేగు చీల్చుకుని ఈ లోకంలోకి రాబోతున్న బిడ్డ గురించి ఎన్నో కలలు కంటారు. సరిగ్గా ఇలాంటి స్టేటాఫ్ మైండ్ లోనే ఉంది ప్రముఖ బాలీవుడి నటి కరీనా కపూర్. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ర్యాంపుపై వాక్ చేసింది.
ర్యాంప్ వాక్ అనగానే మోడల్స్ ఒకరి తరువాత ఒకరు వరుసగా వస్తుంటారు కదా. అదే క్రమంలో కరీనా కూడా ర్యాంప్ మీదికి వచ్చింది. అలా నాలుగు అడుగులు వేసుకుంటూ నడిచిందో లేదో... కన్నీటి పర్యంతమైపోయింది! ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ ఆమె నడవడం చూసేసరికి.. అందరూ నిర్ఘాంతపోయారు. హఠాత్తుగా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందేమో అని హాలంతా టెన్షన్ టెన్షన్. కాసేపటి తరువాత అందరికీ అర్థమైంది ఏంటంటే... కరీనా ఇప్పుడు గర్భిణి అని!
ర్యాంప్ వాక్ అయిపోయిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ... తన కడుపులో బిడ్డతో కలిసి చేసిన తొలి ర్యాంప్ వాక్ ఇది అని చెప్పింది. ర్యాంపు మీద నడుస్తున్నప్పుడు కడుపులో బిడ్డ కదులుతుందేమో అనిపించిందనీ అందుకే భావేద్వేగాలకు లోనైపోయానని, తన జీవితంలో అత్యంత మధురమైన అనుభూతి ఇదే అని కరీనా చెప్పింది. ఒక్కళం కాదు, ఇద్దరం ఒకేసారి ర్యాంపుపై నడుస్తున్నాం అనే ఫీలింగ్ రాగానే అడుగులు తడబడ్డాయనీ, నోట మాట రాలేదనీ, కంట్రోల్ చేసుకుందామని ఎంత ప్రయత్నించినా తమాయించుకోలేకపోయానని కరీనా చెప్పంది. మొత్తానికి, ప్రముఖ డిజైనర్ సవ్యసాచి నిర్వహించిన ఈ ర్యాంప్ వాక్ చాలా ఎమోషనల్ గా ముగిసిందనే చెప్పాలి.