ప‌టౌడీ సంస్థానాధీశురాలికి డార్లింగ్ క్యారేజీ వెళ్లింది

Update: 2021-09-26 14:32 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ తో క‌లిసి ప‌నిచేస్తే ఆయ‌న ఇంటి వంట‌లు టేస్ట్ చూడాల్సిందే. లేదంటే ఆయ‌న‌ ఒప్పుకోరు.  స‌హ‌చ‌రుల‌కు క్యారేజీ గ్యారెంటీ. క‌క్కా.. ముక్కా ఫుల్ గా లాగిస్తేనే డార్లింగ్ హ్యాపీగా ఫీల‌వుతారు. `బాహుబ‌లి` సినిమా టైమ్ లో ఆ సినిమాకు ప‌నిచేసిన ఇత‌ర భాషా న‌టుల‌కు అలాగే త‌న ఇంటి రుచుల్ని చూపించారు. అటుపై `సాహో` సినిమాలో త‌న‌తో జ‌త‌క‌ట్టిన  శ్ర‌ద్ధా క‌పూర్ కి త‌న ఇంటి  వంట‌కాలు పంపారు. ఇటీవ‌లే స‌లార్ బ్యూటీ శ్రుతి హాస‌న్ కొన్ని ర‌కాల బిర్యానీలు.. నాన్ వెజ్ వంట‌కాలు పంపించారు. ఇవ‌న్నీ ప్ర‌భాస్ ఫేవ‌రెట్ చెఫ్ చే స్వ‌యంగా చేయించి పంపించారు.

అవి తిని రుచి చూసిన శ్రుతిహ‌స‌న్ ఫిదా అయిపోయింది. `స‌లార్` సెట్ లో ప్ర‌భాస్ ఇంటి వంట‌కాల‌తో రోజు క‌డుపు నిండిపోతుందని అమ్మ‌డు సంతోషం వ్య‌క్తం చేసింది. ఇవ‌న్నీ త‌న డైరీలో బెస్ట్ మూవ్ మెంట్స్ గా నిలుస్తాయ‌ని తెలిపింది. సాహో శ్ర‌ద్ధ‌.. అనుష్క‌.. త‌మ‌న్నాల‌కు ఇంత‌కుముందు ప్ర‌భాస్ క్యారేజీలు తినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి బాలీవుడ్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ వంతు...  క‌రీనా కోసం ప్ర‌భాస్ ప్ర‌త్యేకంగా బిర్యానీలు..కొన్ని ర‌కాల మాంసాహ‌రం ఫుడ్ ని త‌యారు చేయించి నేరుగా క‌రీనా ఇంటికే పంపించారు. అవి రుచి చూసిన క‌రీనా  ఎంతో రుచిక‌ర‌మైన ఆహారం తిన్నాను అంటూ.. ఇదంతా ప్ర‌భాస్ చ‌లువే అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ కి స్పెష‌ల్ థాంక్స్ చెప్పారు. మ‌రి ఇద్ద‌రు క‌లిసి ఏ సినిమాలో న‌టిస్తున్నారు?  భ‌విష్య‌త్ ప్లానింగ్ లో ఏమైనా ఇలా బుట్ట‌లో వేస్తున్నాడా? అంటే అదేం కాదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ బాలీవుడ్ లో `ఆదిపురుష్ 3డి`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌రీనా  భ‌ర్త సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆ ర‌కంగా ప్ర‌భాస్-సైఫ్ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ ప‌రిచయంతోనే ప్ర‌భాస్ సైఫ్ భార్యామ‌ణికి ఇలా స్పెష‌ల్ బిర్యానీ ట్రీట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.  ప‌టౌడీ ఖాన్ మ్యాడ‌మ్ కి క్యారేజీ న‌చ్చిందంటే ఇక త‌దుప‌రి అత‌డు న‌టించే సినిమాల్లో త‌న‌కు కూడా ఒక పాత్ర క్రియేట్ అవుతుంది. ప్ర‌స్తుతం క‌రీనా భ‌ర్త సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్ 3డిలో రావ‌ణ్ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో నువ్వా నేనా? అన్న‌ట్టు సాగే పాత్ర ఇద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News