నీ మొగుడు చాలా హాట్ అంటున్న హీరోయిన్

Update: 2018-05-23 11:31 GMT
సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాక కాస్త గ్యాప్ ఇచ్చిన కరీనా కపూర్ ఇప్పుడు వారసుడు తైమూర్ అలీ ఖాన్ బాగోగులు వేరే వాళ్ళ ద్వారా చేయించుకునే వయసుకు వచ్చేసాడు కాబట్టి మెల్లగా సినిమాల వైపు అడుగులు వేస్తోంది. తన కొత్త సినిమా వీర్ దే వెడ్డింగ్ జూన్ 1న విడుదలకు  సిద్ధమవుతోంది. స్వర భాస్కర్, సోనమ్ కపూర్, షికా తలపానీయా లతో కలిసి అల్లరి చేసిన కరీనా ప్రమోషన్ లో విస్తృతంగా పాల్గొంటోంది. సినిమా విడుదల అయ్యే సమయానికి ఇందులో నటించిన ఇద్దరు హీరోయిన్లు పెళ్ళైన వాళ్ళే కావడం గమనార్హం. నిజానికి వీర్ దే వెడ్డింగ్ రెండు నెలల క్రితమే విడుదల కావలసింది.కానీ యేవో అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు. మీడియాతో ఈ సినిమా గురించి మాట్లాడిన కరీనా పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.

తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని అంత హాట్ గా ఫిట్ గా ఉంటాడు కాబట్టి బాగా లైక్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఒక్క పేరే చెబితే కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఎక్కడ ఫీల్ అవుతుంది అనుకుందేమో కాబోలు వెంటనే హాలీవుడ్ నటుడు కెన్ విలియం సన్ పేరు కూడా చెప్పేసింది. అతను కూడా భలే హాట్ గా ఉంటాడని చెప్పింది. వీళ్లకు సమానంగా భర్త సైఫ్ అలీ ఖాన్ ఫిట్నెస్ మైంటైన్ చేయటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన కరీనా క్రికెట్ అంటే తనకు ఎంత పిచ్చో కూడా చెప్పింది. భర్త తండ్రి మన్సూర్ అలీ ఖాన్ లాగే సైఫ్ కూడా మంచి ఆటగాడని కితాబు ఇచ్చిన కరీనా వీర్ దే వెడ్డింగ్ మీద చాలా ఆశలే పెట్టుకుంది. పెళ్లి దాని తర్వాత జరిగే తతంగం గొడవలు మనస్పర్థలు నేపథ్యంలో దర్శకుడు శశాంక్ ఘోష్ తీసిన ఈ మూవీపై ట్రేడ్ కూడా మంచి నమ్మకంతో ఉంది
Tags:    

Similar News