రణబీర్ కపూర్- కత్రినా కైఫ్ ల ప్రేమ గురించి కవర్ చేసినంతగా బాలీవుడ్ వేరే ఏ లవ్ స్టోరీని ఫాలో కాలేదేమో అనిపించక మానదు. అంతగా వీరద్దరి గురించి స్టోరీలు పుంఖానుపుంఖాలుగా వచ్చేసిన తర్వాత.. చివరకు వీళ్లిద్దరూ బ్రేకప్ అయిపోయారనే న్యూస్ వచ్చింది. దాని గురించి కూడా ఇంకా ఏమీ ఫైనల్ కాలేదు.
'నా జీవితంలో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి కేట్ .. తనతో విడిపోయినపుడు గుండెలు పిండేసేంతటి బాధ కలిగింద'ని.. రణబీర్ అన్నాడు కానీ.. బ్రేకప్ సంగతులను కత్రినా మాత్రం పంచుకోలేదు. ఫోటోలకు ఫోజులు అడిగితే తీసుకోమంటున్న కత్రినాను ఎక్కడైనా బ్రేకప్ గురించి ఎవరైనా క్వశ్చన్ చేస్తే.. చిర్రుబుర్రులాడి చెక్కేస్తోంది. అందుకే బాలీవుడ్ మీడియా రూట్ మార్చి.. రణబీర్ కి సిస్టర్ అయ్యే కరీనాని అసలు సంగతి చెప్పమన్నారు. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన బెబో.. ఓ ఈవెంట్ కి హాజరైనపుడు రణబీర్-కత్రినాల బ్రేకప్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి కరీనా ఆన్సర్ చూసి అందరూ షాక్ తినేశారు.
'నేను ఇక్కడకు వచ్చిన కారణం అది కాదు. అందుకే దాని గురించి నేను మాట్లాడలేదు. అది సరే కానీ.. నా జుట్టు ఎలా ఉందో చూడండి.. ఎంతగా మెరిసిపోతోందో కదూ' అంటూ ఎదురు ప్రశ్నించి చక్కగా చెక్కేసింది బెబో. దీంతో ఏం చేయాలో తెలీక నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి మీడియా జనాలకి ఎదురైంది.