రణబీర్-కత్రినా గురించి కరీనా ఏమంది?

Update: 2016-02-24 17:30 GMT
బాలీవుడ్ లో బ్రేకప్ మేళా సాగుతోంది కొన్నాళ్లుగా. వరుసగా సెలబ్రెటీ జంటలు విడిపోతూ వస్తున్నాయి. ఐతే వీటిలో ఎక్కువ చర్చనీయాంశమైంది రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ ల బ్రేకప్పే. గత ఏడాది వరకు వీరి పెళ్లి ఇదిగో అదిగో అన్నారు. కానీ ఈ ఏడాది మొదలవ్వగానే ఇద్దరూ బ్రేకప్ చెప్పేశారు. ఈ వ్యవహారం గురించి రణబీర్ కానీ.. కత్రినా కానీ నోరు విప్పలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా సైలెంటుగా ఉన్నారు. ఐతే రణబీర్ కు అక్క అయిన కపూర్ ఫ్యామిలీ అమ్మాయి కరీనా అయినా బ్రేకప్ గురించి ఏమైనా మాట్లాడుతుందేమో అని విలేకరులు ఆమెను ప్రశ్నలు అడిగారు. ఐతే కరీనా తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది.

‘‘రణబీర్ దాని గురించి నాతో చెప్పాడనే అనుకుందాం. కానీ నేను మీకెందుకు దాని గురించి చెప్పాలి? అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. నా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం. అతడి జీవితం అతడి ఇష్టం. అతడి వ్యక్తిగత జీవితం గురించి నేను మీ దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని సెలవిచ్చింది కరీనా. ఇంతకీ బాలీవుడ్ లో వరుసగా ప్రేమ, వివాహ బంధాలు ఎందుకు చెడిపోతున్నాయి అని అడిగితే.. ‘‘ఇద్దరు వ్యక్తులు 20 ఏళ్లు కలిసి ఉన్నాక కూడా వాళ్ల మధ్య విభేదాలు రావచ్చు. విడిపోవాలని నిర్ణయించుకోవచ్చు. ఎప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయో చెప్పలేం. ఆ తర్వాత మొదలయ్యే కొత్త జీవితం కూడా అద్భుతంగా ఉండొచ్చు. ఈ విషయంలో స్థిరమైన అభిప్రాయాలేం ఉండవు. ఒక రిలేషన్ షిప్ బలంగా ఉండటానికి సీక్రెట్స్, టిప్స్ అంటూ ఏమీ ఉండవు’’ అంటూ వేదాంతం వల్లించింది కరీనా.
Tags:    

Similar News