కరీనా ఏం చెప్పి పెళ్లి చేసుకుందంటే..

Update: 2016-03-11 09:30 GMT
ముందు షాహిద్ కపూర్ తో ఐదారేళ్ల పాటు గాఢమైన ప్రేమాయణం నడిపింది కరీనా కపూర్. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటుండగా.. కరీనా అతడికి టాటా చెప్పేసింది. తాను చిన్న పిల్లగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని, ఈడొచ్చిన పిల్లలు కూడా ఉన్న సైఫ్ అలీఖాన్ తో కరీనా ప్రేమలో పడటం.. తర్వాత అతణ్ని పెళ్లి కూడా చేసుకోవడం బాలీవుడ్లో పెద్ద సంచలనం. ఒకప్పుడు సైఫ్ పెళ్లికి చిన్న పిల్లగా ఉన్న కరీనా హాజరై అతడికి గిఫ్టు ఇస్తున్న ఫొటో వీళ్లిద్దరి పెళ్లి సందర్భంగా హల్ చల్ చేసింది కూడా. ఐతే తమ ఇద్దరి మధ్య వయసు అంతరం గురించి వచ్చిన విమర్శలేవీ పట్టించుకోకుండా సైఫ్ తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది కరీనా.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సైఫ్ ను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు వెల్లడించింది కరీనా. తనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తాడు కాబట్టే సైఫ్ ను పెళ్లాడానని కరీనా చెప్పింది. తాను లైఫ్ లాంగ్ సినిమాల్లో కొనసాగుతానని.. ఆ విషయంలో సపోర్ట్ గా నిలవాలని తాను సైఫ్ కు కండిషన్ పెట్టానని.. అతను ఓకే అన్నాకే పెళ్లి చేసుకున్నానని కరీనా వెల్లడించింది. సైఫ్ కరీనాకు ఎంత ఫ్రీడమ్ ఇస్తాడంటే.. పెళ్లి తర్వాత పెట్టుకున్న ‘నో కిస్సింగ్’ పాలసీని పక్కనబెట్టేసి తన కొత్త సినిమా ‘కి.. క’లో అర్జున్ కపూర్ తో లిప్ లాక్స్ చేసినా అతను అభ్యంతర పెట్టలేదు. ఐతే ఈ సినిమా హీరో అర్జున్ కపూర్ అర్ధరాత్రుళ్లు కరీనాకు ఫోన్లు చేస్తుంటే మాత్రం సైఫ్ తట్టుకోలేకపోయాడని.. అతడికి ఫోన్ చేసి వార్నింగులు ఇచ్చాడని ఈ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News