నా మొగుడు చాలా హాట్ అనేసిన భార్య!

Update: 2022-12-20 13:30 GMT
బాలీవుడ్ దంప‌తులు సైఫ్ అలీఖాన్-క‌రీనా క‌పూర్ ల సంద‌డి గురించి చెప్పాల్సి  ప‌నిలేదు. తెర‌పైనే కాదు...తెర వెనుక కూడాఈ జంట ఎంతో రొమాంటిక్ గా క‌నిపిస్తుంది. వ్య‌క్తిగ‌త విష‌యాల్ని ఎంతో ఉత్సాహంతో షేర్ చేసుకుంటారు. తాజాగా ఇద్ద‌రు బిడ్డ‌ల త‌ల్లైనా క‌రీనా భ‌ర్త సైఫ్ అలీఖాన్ గురించి ఓ హాట్ కామెంట్ చేసింది. 'నా మొగుడు చాలా హాట్' అనేసింది.

అంత‌టితో ఆగ‌కుండా భ‌ర్త కండ‌ల్నీ సోష‌ల్ మీడియా లో షూర్   చేసి మ‌రీ చూసారా?  మా ఆయ‌న ప‌నిత‌నం అంటూ సంకేతం ఇచ్చింది. ఇంత‌కీ ఇదెలా చోటు చేసుకుందో తెలుసుకుంటే పోయే! ఈ దంప‌తుల పెద్ద‌కుమారుడు తైమూర్ అలీఖాన్ పుట్టిన రోజు వేడ‌క‌లు ఇటీవ‌ల ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్రీ బ‌ర్త్ డే  వాష్ ని కూడా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా కుమారుడి ఫోటోల‌తో పాటు...హాబ్బీ ఫోటోని కూడా షేర్ చేసింది. ఇందులో సైఫ్ లో జాకెట్ ధ‌రించి మ‌నోహ‌రంగా క‌నిపిస్తున్నాడు.  కండ‌లు చూపించ‌డంలో సైఫ్ ఘానాపాటే కదా. మంచి ఫిజిక్...మ‌జిల్స్ తిరిగి క‌నిపించే స‌రికి క‌రీనా అదుపు త‌ప్పింది. వెంట‌నే భ‌ర్త‌పై త‌న ప్రేమ‌ని సూప‌ర్ హాట్ అంటూ వెల్లుబుచ్చింది.

ఇలాంటి కామెంట్లు క‌రీనాకి కొత్తేం కాదు. భ‌ర్త ఫోటోల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాలో షేర్ చేసి వాటికి టెంప్టింగ్ ఎమోజీల‌ను జ‌త చేస్తుంది. మ‌రి రియ‌ల్ జోడీ..రీల్ లైఫ్ లో కూడా మాంచి రొమాంటిక్ సినిమా ఒక‌టి చేస్తే ఫ్యాన్స్ ఫిదా అవుతారుగా!

ప్ర‌స్తుతం సైఫ్ అలీఖాన్ నుట‌డిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 'ఆదిపురుష్' లో ప్ర‌భాస్ కి విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఇవే గాక 'గో గోవా గాన్' సీక్వెల్‌.. 'హంటర్'.. అనురాగ్ బసుతో మరొక ప్రాజెక్ట్.. 'బంటీ ఔర్ బబ్లీ2' లోనూ న‌టిస్తున్నాడు. అలాగే  కరీనా న‌టించిన 'లాల్ సింగ్ చద్దా' ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్నా ఫ‌లించ‌లేదు. వ‌చ్చే ఏడాది 'ది క్రూ'  సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News