కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన `కర్ణన్` క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకోవడమే గాక సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రీమేక్ గురించి ఫిలింవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
`కర్ణన్` అనేది ఓ కల్ట్ మూవీ. దీనికి పెర్ఫార్మెన్స్ ఉన్న హీరో కావాలి. కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలతో సత్తా చాటిన ధనుష్ అంత పెద్ద స్టార్ చేశాడు కాబట్టి ఈ కల్ట్ కథకు జీవం వచ్చింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇందులో నటించే హీరో ఎవరు? అంటూ గత కొంతకాలంగా చర్చ సాగుతోంది. ఇలాంటి సినిమా రీమేక్ చేయడం అనేదే కత్తి మీద సాము లాంటిది. తెలుగు లో ఎవరు సూటవుతారు అనేది ఆసక్తిగా మారింది.
అయితే ఫిలింసర్కిల్స్ గుసగుసల ప్రకారం... బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రీమేక్ లో నటిస్తారని కథనాలొస్తున్నాయి. అతడు బ్యాక్ టు బ్యాక్ రెండు రీమేక్ ప్రాజెక్టులలో నటించనున్నారు. ఒకటి ప్రభాస్ - రాజమౌళి యాక్షన్ థ్రిల్లర్ ఛత్రపతి హిందీ రీమేక్ కాగా మరొకటి ధనుష్ కర్ణన్ తెలుగు రీమేక్ కోసం సన్నద్ధమవుతున్నాడని కథనాలొస్తున్నాయి.
వచ్చే నెలలో చత్రపతి రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళతారు. ప్రస్తుతం షూటింగ్ కోసం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ ను వేశారు. బెల్లంకొండ కు ఇది హిందీ అరంగేట్ర చిత్రం. ఈ మూవీ పూర్తయ్యాక కర్ణన్ రీమేక్ చిత్రీకరణను ప్రారంభిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వి.వి.వినాయక్ చత్రపతి హిందీ రీమేక్ దర్శకత్వం వహిస్తున్నారు. కర్ణన్ రీమేక్ కోసం శ్రీకాంత్ అడ్డాల రేసులో ఉన్నారని తెలుస్తోంది.